Twitter: ట్విట్టర్ లోగో మార్పుపై నెట్టింట మీమ్స్ వైరల్.. చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం!..
ABN , First Publish Date - 2023-07-24T22:20:26+05:30 IST
మార్చి 15న ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా(Twitter CEO Elon Musk) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలానత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించడం, బ్లూటిక్‌కు డబ్బులు వెచ్చించాల్సి రావడం, ట్వీట్‌లు చూసే విషయంలో, ట్వీట్‌లు పెట్టే విషయంలో పరిమితులు, ట్విట్టర్ వినియోగించాలంటే కచ్చితంగా లాగిన్ కావాలనే నిబంధనలు ఇలా అనేక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగేనే మార్చేశారు.
మార్చి 15న ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా(Twitter CEO Elon Musk) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలానత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించడం, బ్లూటిక్‌కు డబ్బులు వెచ్చించాల్సి రావడం, ట్వీట్‌లు చూసే విషయంలో, ట్వీట్‌లు పెట్టే విషయంలో పరిమితులు, ట్విట్టర్ వినియోగించాలంటే కచ్చితంగా లాగిన్ కావాలనే నిబంధనలు ఇలా అనేక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగేనే మార్చేశారు. మొదటి నుంచి ట్విట్టర్‌కు చిరునామాగా ఉన్న బ్లూ బర్డ్(Blue Bird) స్థానంలో ఎక్స్ (X)ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్ సింబల్‌గా ‘X’ వచ్చి చేరింది. రంగును కూడా నలుపుగా మార్చేశారు. భవిష్యత్‌లోనూ ఇదే కొనసాగనుంది. కాగా ట్విట్టర్ లోగోగా బ్లూబర్డ్ 2006 నుంచి ఉంది. మస్క్ నిర్ణయంతో 17 ఏళ్ల బ్లూబర్డ్ ప్రయాణానికి తెరపడింది. అలాగే మస్క్ ట్విట్టర్ డొమైన్ నేమ్‌ను కూడా మార్చేశారు. twitter.comకి బదులుగా X.com అని తీసుకొచ్చారు. ఈ రెండు మార్పులు సోమవారం నుంచే అందుబాటులోకి వచ్చాయి. మస్క్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాలతో వినియోగదారులు కాస్త అయోమయంలో పడ్డారు. మస్క్ సంచలన మార్పులు తీసుకొస్తారని తెలుసు కానీ, ఇలా ఏకంగా లోగోనే మార్చేస్తారని ఎవరూ ఊహించలేదు.
దీంతో ట్విట్టర్ లోగో మార్పుపై నెట్టింట మీమ్స్ వరద పారుతుంది. అనేక మంది ఫన్నీ మీమ్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఫన్నీ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ‘‘నేను ట్విట్టర్ బ్లూబర్డ్‌ను మిస్ అవుతున్నాను.’’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. పక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని రాసి పక్షి ఫోటోను పోస్ట్ చేశాడు. మరి కొందరేమో రిప్ ట్విట్టర్ బర్డ్(RIP Twitter Bird) అని రాసుకొస్తున్నారు. అలాగే ట్విట్టర్ బర్డుకు ఇతర యాప్‌లను నివాళులార్పిస్తున్నట్టుగా వీడియోలను తయారు చేశారు. ఇంకొందరేమో ట్విట్టర్ బర్డ్ విమానం ఎక్కి వెళ్లిపోతున్నట్టుగా ట్వీట్‌లు పెడుతున్నారు. మరికొందరైతే డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా(WWE Star John Cena) రింగ్‌లో మౌనం పాటించినట్టుగా వీడియోను పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ట్విట్టర్ లోగో మార్పుపై ట్రెండ్ అవుతున్న ఫన్నీ మీమ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే మస్క్ నిర్ణయాన్ని సమర్ధించే వారు కూడా ఉన్నారు. మస్క్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.