Punjab Shocker: అమానుషం.. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా?.. తన పరువు తీసిందని కూతురిని అతి కిరాతకంగా..

ABN , First Publish Date - 2023-08-11T12:41:25+05:30 IST

పంజాబ్‌ (Punjab) లో అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన వాడితో వెళ్లి, తమ పరువు తీసిందని కన్నకూతురు పట్ల ఓ తండ్రి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కుమార్తె కాలిని తాడుతో కట్టి, ఆ తాడును తన బైక్ వెనకవైపు కట్టుకుని లాక్కెళ్లాడు.

Punjab Shocker: అమానుషం.. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా?.. తన పరువు తీసిందని కూతురిని అతి కిరాతకంగా..

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌ (Punjab) లో అమానుష ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన వాడితో వెళ్లి, తమ పరువు తీసిందని కన్నకూతురు పట్ల ఓ తండ్రి అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కుమార్తె కాలిని తాడుతో కట్టి, ఆ తాడును తన బైక్ వెనకవైపు కట్టుకుని లాక్కెళ్లాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రైలుపట్టాల పక్కన మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. సీసీటీవీలో ఈ ఘటన తాలూకు దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడీ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్ పరిధిలోని ముచ్చల్ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన కూతురు తర్వాతి రోజు తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తమ పరువు తీసిందని కోపంతో రగిలిపోతున్న తండ్రి.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమె కాలికి తాడు కట్టి, దాన్ని తన బైక్‌ (Bike) కు కట్టుకుని లాక్కెళ్లాడు. అలా చాలా దూరం వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన యువతి చనిపోయింది. దాంతో ఆమె మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేసి వచ్చేశాడు.

ఇక రైలు పట్టాల పక్కన యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మొదట అక్కడి సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage) ని పరిశీలించారు. ఆ సీసీటీవీ దృశ్యాల ద్వారా సదరు వ్యక్తి చేసిన ఘాతుకం బయటపడింది. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Heartwarming Video: దేవుడు ఎక్కడో పైనుంచి దిగి రాడండి.. ఇదిగో ఈ కొరియర్ బాయ్‌లాంటి వారి రూపంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటాడు..!

Updated Date - 2023-08-11T12:41:25+05:30 IST