Credit Card Limit: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? లిమిట్ పెంచుకోవడం వల్ల లాభాలేంటో తెలుసా?
ABN , First Publish Date - 2023-07-31T17:12:45+05:30 IST
ఆధునిక ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డులు ఒక భాగమైపోయాయి. ప్రస్తుతం ఎంతో మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులను వాడడం వల్ల రివార్డు పాయింట్ల నుంచి నో కాస్ట్ ఈఎంఐ వరకు పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.
ఆధునిక ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డులు (Credit Cards) ఒక భాగమైపోయాయి. ప్రస్తుతం ఎంతో మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులను వాడడం వల్ల రివార్డు పాయింట్ల నుంచి నో కాస్ట్ ఈఎంఐ వరకు పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ (Credit Card Limit) విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచుకునే విషయంలో బ్యాంకులు పలు ఆఫర్లు అందిస్తున్నా వాటిని అందుకోవడానికి సంశయిస్తుంటారు. మరి, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల లాభమా? నష్టమా? తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం ఎలా (How to increase the credit limit)?
ఒక్కో బ్యాంకు (Banks) అందించే క్రెడిట్ కార్డు లిమిట్ ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే వినియోగదారుడి అర్హతలను బట్టి కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకోవడానికి సులభమైన ఆప్షన్.. ఎక్కువ లిమిట్ ఆఫర్ చేసే కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయడమే. కొత్త క్రెడిట్ కార్డు వస్తే పాత క్రెడిట్ కార్డుపై ఉన్న లిమిట్ కూడా పెరుగుతుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుపైనే లిమిట్ పెంచుకోవాలంటే సదరు బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ (Credit Score), ఆదాయం వంటి అంశాల ఆధారంగా మీ రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ కార్డు బిల్లును ప్రతి నెలా కచ్చితంగా చెల్లించాలి. క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఇలా నెల నెలా బిల్లు కరెక్ట్‌గా కడితే.. బ్యాంకులు మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచడానికి అవకాశం ఉంటుంది.
క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల లాభమా? నష్టమా?
మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే అత్యవసర సమయంలో, ఊహించని ఖర్చులు చుట్టు ముట్టిన సమయంలో మీకు ఊరట కలిగిస్తుంది. ప్రతి నెలలో మీరు సమయానికి బిల్లలు చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోరు భారీగా పెరుగుతుంది. అధిక క్రెడిట్ పరిమితిని అంగీకరించడం ద్వారా మీరు మీ వినియోగ నిష్పత్తిని సమర్థవంతంగా తగ్గించవచ్చు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే మీరు ప్రతి నెల క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేసి సకాలంలో బిల్లలు చెల్లించగలిగితే మీకు బోలెడన్ని రివార్డులు (Rewards) వస్తాయి. మీ స్పెండింగ్ కెపాసిటీని బట్టి బ్యాంకులు మీకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తాయి.
MS Dhoni: విమానంలో కూర్చుని నిద్రపోతున్న ధోనీ.. ఆ ఎయిర్ హోస్టెస్ చేసిన పనిపై మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే..
క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుకునే ముందు మీరు మీ ఖర్చు అలవాట్లను అర్థం చేసుకోవాలి. మీరు బాధ్యతాయుతంగా ఖర్చు పెడుతున్నారో లేదో పరీక్షించుకోవాలి. రుణాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే నేర్పు మీకు ఉందా? లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. లేకపోతే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం అనేది మిమ్మల్ని మరింత అప్పుల ఊబిలోకి దించేస్తుంది. ప్రతినెల మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లిస్తే, అధిక పరిమితి మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా అదనపు సౌకర్యాన్ని అందించవచ్చు.