పెళ్లయిన మూడేళ్లకే ఇద్దరు కూతుళ్లు.. కొడుకును కనివ్వకపోతే నువ్వు బతకడం దేనికంటూ భార్యకు నరకం చూపించిన భర్త..!

ABN , First Publish Date - 2023-03-08T19:29:47+05:30 IST

వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చింది. దీంతో భర్తతో పాటూ అత్తమామలు కూడా ఎంతో సంతోషించారు. తమకు వారసుడు పుడుతున్నాడనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే అనూహ్యంగా కూతురు పుట్టడంతో నిరాశలో మునిగిపోయారు. వివాహమైన మూడేళ్లకే..

పెళ్లయిన మూడేళ్లకే ఇద్దరు కూతుళ్లు.. కొడుకును కనివ్వకపోతే నువ్వు బతకడం దేనికంటూ భార్యకు నరకం చూపించిన భర్త..!

వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చింది. దీంతో భర్తతో పాటూ అత్తమామలు కూడా ఎంతో సంతోషించారు. తమకు వారసుడు పుడుతున్నాడనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే అనూహ్యంగా కూతురు పుట్టడంతో నిరాశలో మునిగిపోయారు. వివాహమైన మూడేళ్లకే ఇద్దరు కూతుళ్లు పుట్టడంతో భర్త కోపం కట్టలు తెంచుకుంది. కొడుకును కనివ్వకపోతే నువ్వు బతకడం ఎందుకంటూ భార్యకం నరకం చూపించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఉన్నావ్ పరిధి సఫీపూర్ గ్రామానికి చెందిన యువతికి (young woman) ఖాదర గ్రామానికి చెందిన దీపు అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భిణి (pregnant) కావడంతో భర్తతో పాటూ అత్తమామలూ ఎంతో సంతోషించారు. కొడుకు పుడతాడనే ఆనందంలో భర్త, తమ వంశోద్ధారకుడు పడుతున్నాడనే ఆనందంలో అత్తమామలు ఉన్నారు. ఈ క్రమంలో ప్రసవ సమయం రానే వచ్చింది. అయితే ఆమెకు అంతా ఊహించినట్లు కాకుండా (birth of a girl child) ఆడపిల్ల పుట్టింది. దీంతో భర్త, అత్తమామలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆఖరకు శిశువును ముట్టుకునేందుకు కూడా వారికి మనసు రాలేదు. భర్త తన మనసులోని చికాకును మొత్తం మొదటి రోజే చూపించాడు.

Marriage Gifts: చెల్లి పెళ్లి అంటే ఎవరైనా నగలో.. వస్తువులో కానుకగా ఇస్తారు.. కానీ ఈ అన్నయ్య ఎలాంటి గిఫ్టులను ఇచ్చాడో చూస్తే..

women-crime-news.jpg

కొన్నాళ్లకు అంతా సర్దుకుంది. అయితే ఇంట్లో మాత్రం ఆమెకు అప్పుడప్పుడూ వేధింపులు తలెత్తుతూ ఉండేవి. ఇలా కొన్ని నెలలు గడిచాక ఆమె మళ్లీ రెండో సారి గర్భం దాల్చింది. ఈసారి కొడుకు పుడతాడని అంతా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆమె మళ్లీ ఆడపిల్లకే జన్మనిచ్చింది. దీంతో భర్త ఆగ్రహం కట్టలు (husband was angry) తెంచుకుంది. మళ్లీ కూతురే పుట్టింది, కొడుకును కనివ్వకపోతే నీ బతుకు ఎందుకంటూ చిత్రహింసలు (Torture) పెట్టాడు. అంతటితో ఆగకుండా బాలింత అని కూడా చూడకుండా భార్యపై (Assault on wife) విచక్షణారహితంగా దాడి చేశాడు.

Viral Video: ప్రేయసిని బైక్‌పై ఎదురుగా కూర్చోబెట్టుకుని లిప్ కిస్సులు.. జనాలంతా వీడియోలు తీస్తున్నా వెనక్కు తగ్గని ప్రేమజంట..!

ఈ దాడిలో ఆమె చేయి కూడా విరిగింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కూతురు పరిస్థితి ఇలా అయ్యిందే అంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. ఈ విషయం తెలిసి బాధితురాలి భర్త, అత్తమామలు పరారయ్యారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-03-08T19:29:47+05:30 IST