Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

ABN , First Publish Date - 2023-02-24T21:05:06+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి అభిమానిని నేను.. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా కూడా చూశానని అన్నారు.. టీడీపీ

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..
Nara Lokesh and Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి అభిమానిని నేను.. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా కూడా చూశానని అన్నారు.. టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). ‘యువగళం’ (YuvaGalam) పేరుతో ఏపీలో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా ఆయన తాజాగా తిరుపతి (Tirupati)లో యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఐ.ఐ.ఎం ప్రొఫెసర్ రాజేశ్‌తో పాటు పలువురు యువతీయువకులు (Youth) అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ ముఖాముఖిలో సమాధానమిచ్చారు.

అందులో భాగంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారికి అభిమానిని (Fan) నేను. ఆయన నటించి, రీసెంట్‌గా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని కూడా చూశాను. బాల మామ (Balakrishna) గురించి చెప్పాలంటే.. ఎంతైనా ఆయన ముద్దుల మామయ్య. ఆయన సినిమాలను విడుదలైన మొదటి రోజే.. మొదటి షోనే చూస్తాను..’’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.

ఇంకా పవన్ కల్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTr)ల గురించి మాట్లాడుతూ.. వారిద్దరూ రాజకీయాలలోకి రావాలని కోరారు. 2014లో పవన్ కల్యాణ్‌లో మంచి మనసును చూశాను. నేను ఆయనని అప్పుడు ఒక్కసారే కలిశాను. వారిద్దరే కాకుండా.. అభివృద్ధిలో ఏపీ (Andhra Pradesh) అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనస్సు అని అన్నారు. అలాంటివారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకోవాలనే ‘యువగళం’ పాదయాత్ర చేపట్టానని, ఉద్యోగాల కల్పనే జగన్ రెడ్డి (YS Jagan)కి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని లోకేష్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

*********************************

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

Updated Date - 2023-02-24T21:08:40+05:30 IST