Income tax: ఇన్కమ్ టాక్స్ తో విసిగిపోతున్నారా? ఇలా చేస్తే బోలెడు సేవింగ్స్..

ABN , First Publish Date - 2023-03-15T15:08:02+05:30 IST

ఇన్కమ్ టాక్స్ లో డబ్బు పోగొట్టుకోవాలంటే వ్యాపారవేత్తలకు కూడా బాదే..

Income tax:  ఇన్కమ్ టాక్స్ తో విసిగిపోతున్నారా?  ఇలా చేస్తే బోలెడు సేవింగ్స్..

టాక్స్.. ఈ పదం విన్నారంటే చాలా మందికి సుత్తి తీసుకుని బుర్ర మీద కొట్టినట్టు అనిపిస్తుంది. 'మాకు నచ్చని ఒకే ఒక్క పదం టాక్స్' అనే డైలాగ్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ సంపాదించే ప్రతిఒక్కరూ పన్ను(TAX) చెల్లించాలి. సంపాదనను బట్టి కూడా పన్ను చెల్లింపు ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇలా టాక్స్ రూపంలో పోతుందని, దాన్ని కాస్తయినా తప్పించుకోవాలని వివిధ మార్గాలలో ఇన్వెస్ట్(Invest) చేస్తుంటారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు(Businessmen's) కూడా పన్ను విషయంలో ప్రణాళికలు వేస్తుంటారు. ప్రతి పెట్టుబడి పథకానికి కొన్నిరూల్స్ ఉంటాయి. అవి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి బోల్తా పడేవారు ఉంటారు. కొంచెమయినా పన్ను గోల తప్పించుకోవడానికి అద్భుతమైన సేవింగ్ మార్గాలు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెడితే పన్ను తగ్గడమే కాదు మీ పెట్టుబడికి మంచి రాబడి(Income) కూడా ఉంటుంది. అలాంటి కొన్ని మార్గాలు తెలుసుకుంటే..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. (Public Provident Fund) (PPF)

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో కనీసం 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ PPF పథకంలో కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇన్కమ్ టాక్స్(Income Tax) లో EEE(Exempt-Exempt-Exempt) కింద పెట్టుబడి పెట్టడానికి ఇదొక చిన్న పొదుపు పథకం. తెలివైన పెట్టుబడిదారులు ఈరకమైన మార్గాలలో ఇన్వెస్ట్ చేస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా 7.1శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఇందులో 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

సుకన్య సమృద్ది యోజన.. (Sukanya Samriddhi Yojana)

మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఈ స్కీమ్ ద్వారా మీరు మంచి పెట్టుబడులు పెట్టవచ్చు, వాటికి తగిన రాబడి పొందవచ్చు. 2015సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెడితే 7.6శాతం వడ్డీ వస్తుంది. ఇందులో పెట్టుబడికి కూడా 80C కింద పన్ను ఉండదు.ఆడపిల్లలు పుట్టిన తరువాత ఏ సమయంలోనైనా ఇది ప్రారంభించవచ్చు. 10ఏళ్ళు కొనసాగించవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate)

ఇది కూడా ఒక చిన్న పొదుపు పథకం. ఇది 80C సెక్షన్ కు అనుబంధం అయి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 7శాతం వడ్డీరేటు ఉంటుంది.

Read also: పెళ్ళిలో డిజే పెట్టారు.. నేేను మీ పెళ్ళి చేయనని వెళ్ళిపోయిన మౌల్వీ.. వధువు కుటుంబం చేసిన పనికి పాపం..


Updated Date - 2023-03-15T15:12:17+05:30 IST