marriage Helicopter : తమ్ముడి పెళ్లికి హెలికాప్టర్ తీసుకొచ్చిన అన్న.. ఎందుకంటే..?
ABN , First Publish Date - 2023-03-02T11:55:23+05:30 IST
తమ్ముడిపై ఉన్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడో ఓ అన్న..తమ్ముడి పెళ్లి(Marriage) గుర్తుండిపోయేలా ..
ఖైరతాబాద్(ఆంధ్రజ్యోతి): తమ్ముడిపై ఉన్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడో అన్న. తమ్ముడి పెళ్లి(Marriage) గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు. దూరప్రాంతాల్లో ఉన్న బంధువులకు పెళ్లి పత్రికలను ఇవ్వాలంటే కొరియర్ ద్వారానో.. మెసేజ్‌ల రూపంలోనో పంపిస్తుంటాం. కానీ తమ్ముడిపై ప్రేమతో ఏకంగా హెలికాఫ్టర్ (Helicopter) రంగంలోకి దించాడు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బంధువులందరికీ హెలికాఫ్టర్ ద్వారా తన తమ్ముడి లగ్న పత్రికలను (Wedding Invitation) పంపిణీ చేసి సోదరుడిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్(Khairatabad) నివాసి, దూద్‌వాలా, డెయిరీ (Dairy) నిర్వాహకుడు మధుయాదవ్ తమ్ముడు చందు యాదవ్ పెళ్లి ఈ నెల 9న జరగనుంది. ముంబైలో ఉన్న బంధువులు, మిత్రులకు తమ్ముడి పెళ్లి పత్రికలు పంచేందుకు మధు ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్‌లో ఆహ్వాన పత్రికలు పంచాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.