Rusk Making Video: రస్కులు తినే అలవాటుందా..? ఎలా చేస్తున్నారో చూస్తే కొనడానికి కూడా భయపడతారేమో..!
ABN , First Publish Date - 2023-11-22T22:23:49+05:30 IST
చాయ్ ప్రియులకు టీ తాగే సమయంలో వెంటనే బిస్కట్లు, రస్కులు గుర్తుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే టీ, కాఫీలతో పాటూ తప్పనిసరిగా రస్కులనరు తినడం అలవాటు చేసుకుంటుంటారు. టీలో రస్కులను ముంచి లొట్టలేసుకుంటూ రుచిని ఆస్వాదిస్తుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా...
చాయ్ ప్రియులకు టీ తాగే సమయంలో వెంటనే బిస్కట్లు, రస్కులు గుర్తుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే టీ, కాఫీలతో పాటూ తప్పనిసరిగా రస్కులనరు తినడం అలవాటు చేసుకుంటుంటారు. టీలో రస్కులను ముంచి లొట్టలేసుకుంటూ రుచిని ఆస్వాదిస్తుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు కూడా వివిధ రకాల బిస్కట్లు, రస్కులను తయారు చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కొన్నిసార్లు ఇక్కడే అసలు సమస్య ఎదురవుతుంటుంది. తినుబండారాల తయారీలో కొందరు పాటించే పద్ధతులు చూస్తే.. మరోసారి వాటిని తినే సాహసం చేయాలంటేనే భయపడతారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రస్కులను తయారుచేసే పద్ధతిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రస్కుల తయారీలో (Rusk Making) పరిశ్రమలో చాలా మంది కార్మికులు పని చేస్తుంటారు. ముందుగా వారు పెద్ద ఎత్తున మైదా పిండిని తీసుకుని, చేతులకు ఎలాంటి గ్లౌజులు వాడకుండా మిక్స్ చేస్తారు. చేతులతో చాలా సేపు పిండిని మిక్స్ చేసిన తర్వాత.. నీళ్లలో పంచదార కూడా కలిపి మిక్స్ చేస్తారు. చివరగా మైదా పిండి మిశ్రమాన్ని కూడా అందులో వేసి, బాగా కలిసిపోయేలా చేతులతో మిక్స్ చేస్తారు. ఆ సమయంలోనూ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. ఇలా చాలా సేపు ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ మిశ్రమంలో నూనె వేసి మళ్లీ కలుపుతారు. ఇలా చివరకు ఆ పిండిని రస్కుల తయారీకి అనువుగా చేసుకుని ఓ పెద్ద పొయ్యి మీద హీట్ చేస్తారు. బాగా కాలిన తర్వాత బయటికి తీసి, రస్కుల ఆకారంలో కట్ చేస్తారు.
చివరగా మళ్లీ రస్కులను పెనం మీద చాలా సేపు వేడి చేస్తారు. ఇలా చివరకు వేడి వేడి రస్కులను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో కార్మికులు (making rusk with unhygienic process) ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే రస్కులను సిద్ధం చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! దీన్ని చూస్తుంటే రస్కులను తినాలంటే రిస్క్ చేయాలేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో కనీస జాగ్రత్తలయినా తీసుకోవాలి’’.. అని మరికొందరు, ‘‘అందులోని బ్యాక్టీరియా వేడి చేయగానే చనిపోయి ఉంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.