ఈయన ఆయన కాదు.. మరదలి ఫిర్యాదుతో వెలుగులోకి విస్తుపోయే నిజం.. 17 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడని చెప్పడంతో..

ABN , First Publish Date - 2023-02-24T19:13:48+05:30 IST

వారిద్దరూ కవలలు. ఒకే పోలికలు ఉండడంతో కొన్నిసార్లు ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టేందుకు ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వారిలో ఓ వ్యక్తి చనిపోతాడు. అయితే అతడి స్థానంలో మరో వ్యక్తి వెళ్లి.. చివరకు..

ఈయన ఆయన కాదు.. మరదలి ఫిర్యాదుతో వెలుగులోకి విస్తుపోయే నిజం.. 17 ఏళ్ల క్రితమే భర్త చనిపోయాడని చెప్పడంతో..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ కవలలు. ఒకే పోలికలు ఉండడంతో కొన్నిసార్లు ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టేందుకు ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వారిలో ఓ వ్యక్తి చనిపోతాడు. అయితే అతడి స్థానంలో మరో వ్యక్తి వెళ్లి.. చివరకు విలన్లను అందరినీ చంపేసి, సమస్యలన్నీ పరిష్కరిస్తాడు.. ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే చూస్తాం. అయితే అప్పుడప్పుడూ నిజ జీవితంలో కూడా సినిమా తరహా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బీహార్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈయన ఆయన కాదంటూ మరదలు ఫిర్యాదు చేయడంతో చివరకు విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) ఇమాద్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్యామానందన్ అనే వ్యక్తికి సోదరుడు జగదానంద్ ప్రసాద్ అనే తమ్ముడు ఉండేవాడు. వీరిద్దరూ ఒకే పోలికలతో ఉండేవారు. దీంతో అన్న ఎవరో, తమ్ముడు ఎవరో గుర్తించే క్రమంలో స్థానికులు కూడా తికమకపడేవారు. ఇలావుండగా, తమ్ముడు జగదానంద్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో (Government Hospital) విధులు నిర్వర్తించేవాడు. కారణం ఏంటో తెలీదు గానీ.. 17 సంవత్సరాల క్రితం జగదానంద్ ఉన్నట్టుండి చనిపోయాడు.

అన్నయ్య చేసుకోవాల్సిన అమ్మాయితో.. అదే ముహూర్తానికి తమ్ముడితో పెళ్లి.. గంటల్లోనే సడన్‌గా వరుడినే మార్చడం వెనుక కథేంటంటే..

bihar-crime-news.jpg

అయితే ఈ విషయం మృతుడి అన్న శ్యామానందన్‌కు మాత్రమే తెలుసు. అప్పటిదాకా బాగున్న శ్యామానందన్ బుద్ధి.. తమ్ముడు చనిపోగానే చెడిపోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తమ్ముడి మృతదేహాన్ని మాయం చేసి, అతడి స్థానంలో ఇంట్లోకి వెళ్లాడు. అంతేగాకుండా ఆస్పత్రిలో తమ్ముడి ఉద్యోగం (Govt job) కూడా చేస్తుండేవాడు. రెండు పాత్రలనూ ఎలా కవర్ చేశాడో తెలీదు గానీ.. మొత్తానికి ఎవరికీ అనుమానం రాకుండా 19 డిసెంబర్ 2001 నుండి 17 జనవరి 2018 వరకు నెట్టుకొచ్చాడు. అయితే ఇటీవల తమ్ముడు జగదానంద్ భార్య సంగీతాదేవికి అనుమానం వచ్చింది.

OYO Rooms: అమ్మ బాబోయ్.. ఓయో రూమ్స్‌ను ఇలాంటి పనులకు కూడా వాడుతున్నారా..? పోలీసుల రైడింగ్‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. చివరకు అసలు నిజం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్యామానందన్ పరారయ్యాడు. ఈ క్రమంలో ఇమాద్‌పూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడనే సమాచారం అందడంతో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే నిందితుడు తాను జగదానందన్ ప్రసాద్‌గా నిరూపించుకునేందుకు కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral Video: అతడు చేసిన ఒక్క పనితో కొంగ మనసు కరిగిపోయింది.. బైక్‌పై వెళ్తున్నా సరే ఎగురుకుంటూ వెనకే వచ్చేస్తుంది..!

Updated Date - 2023-02-24T19:13:52+05:30 IST