Viral Video: దాదాపు ప్రాణం పోయి ఎండిపోయిన ఊసరవెల్లిని.. ఇతను సీపీఆర్ చేసి ఎలా బతికించాడో చూడండి..

ABN , First Publish Date - 2023-10-12T16:17:27+05:30 IST

గుండెపోటుతో ఇబ్బంది పడుతూ చావుబతుకులు మధ్య ఉన్న వారిని.. కొందరు సమయానికి దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి కాపాడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని క్షణాలు ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి అద్భుత ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో...

Viral Video: దాదాపు ప్రాణం పోయి ఎండిపోయిన ఊసరవెల్లిని.. ఇతను సీపీఆర్ చేసి ఎలా బతికించాడో చూడండి..

గుండెపోటుతో ఇబ్బంది పడుతూ చావుబతుకులు మధ్య ఉన్న వారిని.. కొందరు సమయానికి దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి కాపాడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని క్షణాలు ఆలస్యం జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి అద్భుత ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఓ ఊసరవెళ్లికి.. ఓ వ్యక్తి సీపీఆర్ చేసి ప్రాణాలు పోశాడు. ఇంతకీ అతను ఎలా బతికించాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ చెట్టు కింద ఊసరవెల్లి (chameleon) పడిపోయి ఉంటుంది. ఎలాంటి చలనం లేకపోవడంతో పాటూ దాదాపు ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. దాన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే అక్కడికి వెళ్లి చేతిలోకి తీసుకుంటాడు. పూర్తిగా పరిశీలించిన తర్వాత.. ముందుగా దానిపై నీళ్లు పోస్తాడు. కానీ దానిలో ఏమాత్రం చలనం రాదు. తర్వాత దానిపై మొత్తం నీళ్లు పోసి అటూ, ఇటూ కదిలించి చూస్తాడు. అయినా ఊసరవెల్లిలో మాత్రం ఎలాంటి కదలికలూ కనిపించవు. దీంతో చివరగా దాని నోట్లో మళ్లీ కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. శరీరంపై చేతి వేళ్లతో ఒత్తిడి చేస్తాడు. ఇలా చేస్తూనే మధ్య మధ్యలో దాని నోట్లోకి గాలి ఊదుతూ.. (Man save dying chameleon by CPR) మనుషులకు చేసినట్లుగానే సీపీఆర్ చేస్తాడు. అతడి కష్టం వృథా కాలేదు.

Female Teacher: ‘‘డాడీ! మా టీచర్ రోజూ ఇలాంటి మెసేజ్‌లే చేస్తోంది’’.. అంటూ కొడుకు చూపించిన వాట్సప్ హిస్టరీ చూసిన తండ్రి.. చివరకు..

కొద్ది సేపు ఇలా చేసిన తర్వాత.. ఊసరవెల్లిలో చలనం వస్తుంది. నోటి తెరస్తూ గాలి పీల్చుకోవడం మొదలెడుతుంది. దీంతో అతడు ఎంతో సంతోషించి.. మళ్లీ మధ్య మధ్యలో సీపీఆర్ చేస్తూ ఉంటాడు. చివరకు పైకి లేచి నిలబడిన ఊసలవెల్లికి ఇంజెక్షన్ ద్వారా నీటిని అందిస్తాడు. ఇలా దాన్ని యథాస్థితికి తీసుకువచ్చి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాడు. తన ప్రాణాలు కాపాడినందుకు ధన్యావాదాలు తెలియజేసినట్లుగా అది కూడా.. అతన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని మళ్లీ బయటికి వదిలేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఇది అద్భుతం’’.. అని కొందరు, ‘‘అతడి కష్టం వృథా కాలేదు’’.. అని మరికొందరు, ‘‘అసలు ఇది ఎలా సాధ్యం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-12T16:17:27+05:30 IST