Female Teacher: ‘‘డాడీ! మా టీచర్ రోజూ ఇలాంటి మెసేజ్‌లే చేస్తోంది’’.. అంటూ కొడుకు చూపించిన వాట్సప్ హిస్టరీ చూసిన తండ్రి.. చివరకు..

ABN , First Publish Date - 2023-10-11T21:29:15+05:30 IST

కొందరు చేసే తప్పుల వల్ల కొన్నిసార్లు ఆ వర్గానికి, వ్యవస్థకు మొత్తం చెడ్డ పేరు వస్తుంటుంది. అందులోనూ పవిత్రంగా భావించే వృత్తుల్లో ఉన్న వారిలోనూ కొందరు తప్పుడు పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. తాజాగా...

Female Teacher: ‘‘డాడీ! మా టీచర్ రోజూ ఇలాంటి మెసేజ్‌లే చేస్తోంది’’.. అంటూ కొడుకు చూపించిన వాట్సప్ హిస్టరీ చూసిన తండ్రి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు చేసే తప్పుల వల్ల కొన్నిసార్లు ఆ వర్గానికి, వ్యవస్థకు మొత్తం చెడ్డ పేరు వస్తుంటుంది. అందులోనూ పవిత్రంగా భావించే వృత్తుల్లో ఉన్న వారిలోనూ కొందరు తప్పుడు పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. తాజాగా, యూపీలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. రోజూ ఓ విద్యార్థికి అసభ్యకర మెసేజ్‌లు చేయడం మొదలెట్టింది. ఓ రోజు సదరు విద్యార్థి.. ‘‘డాడీ! మా టీచర్ రోజూ ఇలాంటి మెసేజ్‌లే చేస్తోంది’’.. అంటూ తన తండ్రికి చూపించాడు. చివరకు ఏం జరిగిందంటే..

యూపీలోని కాన్పూర్‌లో (UP Kanpur) ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు.. స్థానిక కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (Private school) పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఈ పాఠశాలలో పని చేస్తున్న మహిళా టీచర్ (female teacher) .. పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమె సదరు బాలుడిని వేరే దృష్టితో చూడడం మొదలెట్టింది. చివరకు అతడిపై ప్రేమ పెంచుకుంది. బాలుడిని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఓ రోజు (WhatsApp message) వాట్సప్ మెసేజ్ చేసింది. తనతో శృంగారం చేయాలంటూ అసభ్యకర మెసేజ్‌లు చేయడంతో పాటూ మతం కూడా మారాలని చెబుతూ వచ్చింది. కొన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పని అతను.. చివరికి భయంతో ఇంట్లో చెప్పేశాడు.

Crime news: నదిలో ఈత కొడుతున్న యువకుల కాళ్లకు తగిలిందో మూట... కష్టపడి బయటికి లాక్కొచ్చి తెరచి చూడగా..

కొడుకు చూపించిన మెసేజ్‌లు చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చివరకు వాటిని తీసుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సదరు టీచర్ తన కొడుకుతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తోందని చెప్పాడు. అలాగే అందుకు సంబంధించిన మెసేజ్‌లు కూడా చూపించాడు. టీచర్ భర్త, సోదరుడు కూడా అదే పాఠశాలలో పని చేస్తున్నారని, ముగ్గురూ కలిసి తమ కొడుకును మతం మారాలంటూ కూడా బలవంతం చేస్తున్నారని ఆరోపించాడు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం చూపించలేకపోయాడు. పోలీసు అధికారులు మాట్లాడుతూ, విద్యార్థికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు పంపిన మాట వాస్తవమే అని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-11T21:33:32+05:30 IST