Narendra Modi: ప్రధాని మోదీ దుస్తుల తయారీ ఎక్కడో తెలుసా...
ABN , First Publish Date - 2023-04-12T12:58:30+05:30 IST
ఇటీవల రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి
పెరంబూర్(చెన్నై): ఇటీవల రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి గాంభీర్యం తెచ్చిన కెమో దుస్తులు తిరుప్పూర్(Tiruppur)లో తయారయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9వ తేది కర్ణాటక రాష్ట్రం బందియూర్ పులుల శరణాలయానికి వెళ్లి అక్కడి నుంచి వాహన సవారీ చేశారు. అక్కడి నుంచి నీలగిరి జిల్లాలోని ముదుమలై పులుల శరణాలయానికి చేరుకున్న ప్రధాని మావటి దంపతులు బొమ్మన్, బెల్లీలను కలుసుకొని అభినందించారు. ఆ క్షణంలో సైనిక దుస్తుల్లో కెమో టీ-షర్ట్, ప్యాంట్, టోపి ధరించి గాంభీర్యంగా కనిపించిన ప్రధాని మోదీ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రధాని ధరించిన కెమో బీచ్ టీ-షర్ట్ తిరుప్పూర్‌లోని చెన్నై సిల్క్స్ గ్రూప్‌కు చెందిన ఎస్‌సీఎం గార్మెంట్ తయారుచేసింది. తిరుప్పూర్ గర్వపడేలా సైనికుడిలా ప్రధాని ఉన్న ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో వస్త్ర వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.