Viral Video: వావ్.. ఏం వీడియో గురూ.. చూసిన వాళ్లంతా ఫిదా అయిపోతున్నారుగా..!

ABN , First Publish Date - 2023-02-22T17:54:16+05:30 IST

వేటాడే పద్ధతి జంతువులు, పక్షుల్లో ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. కొన్నిసార్లు అవి వేటాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. నక్కి నక్కి వేటాడే పులులు, సింహాలను చాలాసార్లు చూశాం. అలాగే పక్షులు కూడా అప్పుడప్పుడు చాలా తెలివిగా..

Viral Video: వావ్.. ఏం వీడియో గురూ.. చూసిన వాళ్లంతా ఫిదా అయిపోతున్నారుగా..!

వేటాడే పద్ధతి జంతువులు, పక్షుల్లో ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. కొన్నిసార్లు అవి వేటాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. నక్కి నక్కి వేటాడే పులులు, సింహాలను చాలాసార్లు చూశాం. అలాగే పక్షులు కూడా అప్పుడప్పుడు చాలా తెలివిగా వేటాడుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్! ఏం వీడియో గురూ.. అంటూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో పక్షి వేటను చూస్తే.. మీరు కూడా వావ్!.. అనకుండా ఉండలేరు...

సోషల్ మీడియాలో పక్షి వేటకు సంబంధించిన వీడియో ( birds Viral videos) ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ముందుగా ఈ వీడియోను గమనిస్తే.. నీటిలోంచి ఏదో ఆకారం పైకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. బహుశా ఏదో వింత చేప అయి ఉండొచ్చని అంతా అనుకుంటారు. కానీ కాసేపు ఆగి చూస్తే.. పొడవాటి రెక్కలను విదిలించుకుంటూ ఓ పక్షి నీటిలోంచి పైకి తేలుతుంది. మెల్ల మెల్లగా రెక్కలను మరింత వేగంగా ఆడిస్తూ.. గాలిలోకి ఎగురుతుంది. ఇంతలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. పక్షి కాళ్లకు (bird hunting fish) ఓ పొడవాటి చేప బంధీ అయి ఉంటుంది.

Viral Video: పెళ్లిలో డాన్స్ చేస్తూనే పగ తీర్చుకున్న యువకుడు.. నవ్వుతూ నవ్వుతూనే చివరకు ఎంత పని చేశాడంటే భయ్యా..

ఓ వైపు చేప తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు పక్షి.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. అన్నట్లుగా దాన్ని గట్టిగా పట్టుకుని తన గమ్యం దిశగా సాగిపోతుంది. అయితే, ఈ సన్నివేశాన్ని ఎంతో సమయస్ఫూర్తితో తన కెమెరాలో (Cameraman) బంధించిన వ్యక్తిని.. నెటిజన్లు అభినందిస్తున్నారు. విజువల్ వండర్‌లా (visual wonder) ఉందంటూ కొందరు, ఖచ్చితంగా చూసి తీరాల్సిన వీడియో.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‪‌ను సొంతం చేసుకుంది.

వాష్ రూంకి వెళ్లాలని చెప్పి భర్తతో రూ.10లు తీసుకున్న నవ వధువు.. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఆమె చేసిన నిర్వాకం..

Updated Date - 2023-02-22T19:43:47+05:30 IST