Viral: కారును పార్క్ చేసేంత స్థలంలో చిన్న ఇల్లు.. అద్దె ఏకంగా రూ.1.30 లక్షలు.. ఏరి కోరి మరీ అక్కడే ఎందుకు ఉంటోందంటే..!

ABN , First Publish Date - 2023-07-04T18:29:34+05:30 IST

కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు కూడా మనిషి జీవితంలో అనూహ్య మార్పులు తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు విలాసవంతమైన జీవితానికి స్వస్తి పలుకుతూ ఉన్నట్టుండి సాధారణ జీవితం గడపడానికి అలవాటు పడుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలు..

Viral: కారును పార్క్ చేసేంత స్థలంలో చిన్న ఇల్లు.. అద్దె ఏకంగా రూ.1.30 లక్షలు.. ఏరి కోరి మరీ అక్కడే ఎందుకు ఉంటోందంటే..!

కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు కూడా మనిషి జీవితంలో అనూహ్య మార్పులు తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు విలాసవంతమైన జీవితానికి స్వస్తి పలుకుతూ ఉన్నట్టుండి సాధారణ జీవితం గడపడానికి అలవాటు పడుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ మహిళకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఖరీదైన ఇంట్లో ఉండగలిగే స్థోమత ఉన్నా.. కారును పార్క్ చేసేంత స్థలంలో నిర్మించిన చిన్న ఇంట్లో ఏకంగా రూ.1.30 లక్షల అద్దె చెల్లించి ఉంటోంది. నెటిజన్లను షాక్‌కు గురి చేసిన ఈ వార్త వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ (Viral news) హల్‌చల్ చేస్తోంది. న్యూయార్క్‌కు (New York) చెందిన 40 ఏళ్ల మహిళ (woman) తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియలో చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాకు (California) చెందిన ఈమె సవతి తండ్రి కరోనా సమయంలో మృతి చెందాడు. తండ్రి మృతి ఆమె జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది. అప్పటిదాకా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఆమె.. తండ్రి మృతి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2022లో తనకు ఉన్న ఇల్లు, మిగతా ఆస్తుల్లో కొన్నింటిని అమ్మేసింది. మరికొన్నింటిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేసింది. కేవలం రెండు సూట్‌కేసులు, ఓ కెమెరాతో న్యూయార్క్ నుంచి బయలుదేరి.. శాంటామోనికాకు చేరుకుంది.

Viral Video: పెంపుడు కుక్క హెచ్చరిస్తున్నా వినిపించుకోని యువతి.. గిటార్ వాయిస్తుండగా ఉన్నట్టుండి..

New-York-woman.jpg

అక్కడ ఆమె 140 చదరపు అడుగులు (140 square feet) ఉన్న చిన్న ఇంటిని (small house) అద్దెకు తీసుకుంది. అప్పటి నుంచి ఏకంగా రూ.1.30 లక్షలు చెల్లించి మరీ అందులో అద్దెకు ఉంటోంది. అందులోని గదిని లివింగ్ రూమ్, ఆఫీసు, కిచెన్.. ఇలా అవరసరాన్ని బట్టి మార్చుకుంటుంది. చిన్న స్థలంలో జీవించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సదరు మహిళ చెబుతోంది. ‘‘నేను సమయం, శక్తి, డబ్బును ఆదా చేస్తాను. గతంలో న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌కు నెలకు $4,500 (రూ.3.68లక్షలు) చెల్లించేదాన్ని. ప్రస్తుతం చిన్న ఇల్లు అయినా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఈ కొత్త జీవనశైలి నా జీవితంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది’’.. అని ఆమె చెబుతోంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లెు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Auto Drivers: ఐఫోన్‌ను పోగొట్టుకున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం.. తనను దించేసిన ఆటో డ్రైవర్‌ను వెతుక్కుంటూ వెళ్తే..!

Updated Date - 2023-07-04T18:29:34+05:30 IST