Viral Video: కుక్కల గుంపుతో పిల్లి ఒంటరి పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2023-07-02T16:12:25+05:30 IST

కుక్క, పిల్లికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పిల్లిని చూడగానే కుక్క వెంటబడటం, కుక్క ఎదురుపడగానే పిల్లి పారిపోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. పిల్లికి భయపడి కుక్క పారిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి...

Viral Video: కుక్కల గుంపుతో పిల్లి ఒంటరి పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ సీన్..

కుక్క, పిల్లికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పిల్లిని చూడగానే కుక్క వెంటబడటం, కుక్క ఎదురుపడగానే పిల్లి పారిపోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. పిల్లికి భయపడి కుక్క పారిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పిల్లి, కుక్కలకు సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ వైపు కుక్కల గుంపు.. మరోవైపు ఒకే ఒక్క పిల్లి పోరాటానికి దిగుతాయి. చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. చాలా కుక్కలు గుంపులుగా వెళ్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఓ పిల్లి ఎదురవుతుంది. ఇంకేముందీ.. వెంటనే దాన్ని వెంబడించి వెంబడించి దాడి చేయాలని ప్రయత్నిస్తాయి. కుక్కలను చూడగానే పారిపోతుందనుకున్న పిల్లి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఏమైతే అదవుతుంది.. అనుకుందో ఏమోగానీ, అన్ని కుక్కలు మీదికి వస్తున్నా పోటాపోటీగా తలపడుతుంది. కుక్కలు మొరుగుతూ మీదికి వస్తున్నా.. భయపడకుండా వాటికి ఎదురు నిలబడుతుంది. కోపంగా (cat fighting with dogs) అరుస్తూ వాటి మీదకు ఎదురుదాడి చేస్తుంది.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

దీంతో కుక్కలు కూడా ఉలిక్కిపడి వెనక్కు తగ్గుతాయి. దాడి చేయాలని దగ్గరికి వెళ్లి.. పిల్లి ఆవేశం చూసి భయంతో వెనక్కు వెళ్తాయి. ఇలా చాలా సేపు వాటి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇది పిల్లి కాదు.. పులి’’.. అంటూ కొందరు, ‘‘ఇంట్లో బంధించి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది అంటే ఇదేనేమో’’.. అని మరికొందరు, ‘‘పిల్లి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

Updated Date - 2023-07-02T16:12:25+05:30 IST