woman: ప్రేమికుడిని అర్ధరాత్రి ఇంటికి పిలిచిన వివాహిత.. కాసేపటికి పొలంలో కనిపించడంతో.. ఓ వ్యక్తికి అనుమానం వచ్చి చూడగా..

ABN , First Publish Date - 2023-07-02T20:08:27+05:30 IST

ముగ్గురు పిల్లలు, భర్తతో సంతోషంగా జీవించాల్సిన మహిళ.. తెలిసి తెలిసి తప్పటడుగు వేసింది. కుటుంబ పోషణ నిమిత్తం ఇంటికి దూరంగా ఉన్న భర్తను మోసం చేస్తూ మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త లేని సమయంలో అతడిని ఏకంగా ఇంటికే పిలిచేది. అయితే ..

woman: ప్రేమికుడిని అర్ధరాత్రి ఇంటికి పిలిచిన వివాహిత.. కాసేపటికి పొలంలో కనిపించడంతో.. ఓ వ్యక్తికి అనుమానం వచ్చి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు పిల్లలు, భర్తతో సంతోషంగా జీవించాల్సిన మహిళ.. తెలిసి తెలిసి తప్పటడుగు వేసింది. కుటుంబ పోషణ నిమిత్తం ఇంటికి దూరంగా ఉన్న భర్తను మోసం చేస్తూ మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త లేని సమయంలో అతడిని ఏకంగా ఇంటికే పిలిచేది. అయితే ఇటీవల ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ ప్రియుడిని ఇంటికి పిలిచిన మహిళ.. కాసేపటికి మరికొంతమందితో కలిసి పొలంలో కనిపించింది. ఓ వ్యక్తికి అనుమానం రావడంతో చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) ముజఫర్‌పూర్‌లోని కర్జా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 28ఏళ్ల మహిళకు (woman) పదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త బయటి ప్రాంతంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇదిలావుండగా, సదరు మహిళకు నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. భర్త ఎక్కువగా బయటి ప్రాంతంలో ఉండడంతో యువకుడు తరచూ వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు.

Viral Video: కారుపై కేకులు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు.. చివరకు ఈ యువకులకు గట్టి షాకే తగిలిందిగా..

women-crime-news.jpg

ఈ క్రమంలో ఆమెతో యువకుడికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది కాస్తా.. కొన్నాళ్లకే వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. కాగా, ప్రమోద్ కుమార్‌కు ఏడాదిన్నర క్రితం వేరే యువతితో వివాహం అయింది. అయినా అతను మాత్రం తరచూ ప్రియురాలిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మహిళ తన ప్రియుడిని (boyfriend) ఇంటికి పలిచింది. దీంతో ప్రమోద్ అర్ధరాత్రి సమయంలో ప్రియురాలి వద్దకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఇద్దరూ ఏదో విషయమై గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ ప్రియుడిపై (Woman assaults boyfriend) దాడి చేసింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆమె బావ, మరికొంత మందితో కలిసి ప్రియుడిని హత్య చేసింది.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

ప్రమోద్ మృతదేహాన్ని రాత్రి ఒంటి గంట సమయంలో ఊరి బయట పొలంలో పాతిపెట్టారు. ఆ సమయంలో వారిని గమనించిన ఓ వ్యక్తి.. ప్రమోద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీతో ప్రమోద్ సోదరుడు పోలీసులతో కలిసి వేకువజాము 3గంటల సమయంలో అక్కడికి వెళ్లారు. పాతిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న మహిళ.. మరుసటి రోజు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

Updated Date - 2023-07-02T20:08:27+05:30 IST