Viral Video: మంటగలిసిన మానవత్వం.. బోరు బావిలో నవజాత శిశువు.. 5గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత..
ABN , First Publish Date - 2023-12-13T11:49:03+05:30 IST
Newborn Girl Stuck in Abandoned Bore Well in Odisha: ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాడుబడ్డ బోరుబావిలో నవజాతశిశువు కనిపించడం కలకలం సృష్టించింది. 20 అడుగుల లోతులో ఉన్న శిశువును రెస్క్యూ సిబ్బంది ఐదున్నర గంటల పాటు కష్టపడి అతికష్టం మీద ప్రాణాలతో కాపాడారు.
Newborn Girl Stuck in Abandoned Bore Well in Odisha: ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాడుబడ్డ బోరుబావిలో నవజాతశిశువు కనిపించడం కలకలం సృష్టించింది. 20 అడుగుల లోతులో ఉన్న శిశువును రెస్క్యూ సిబ్బంది ఐదున్నర గంటల పాటు కష్టపడి అతికష్టం మీద ప్రాణాలతో కాపాడారు. కాగా, ఆ నవజాతశిశువును ఎవరు ఆ బోరుబావిలో పడేశారనే విషయం తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం సంబల్ పూర్ పరిధిలోని లారిపలి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. బోరుబావిలోంచి నవజాతశిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వెంటనే రెస్క్యూ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. శిశువు 20 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించిన ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Odisha Disaster Rapid Action Force) వెంటనే రంగంలోకి దిగింది. సాయంత్రం నాలుగు గంటలకు రెస్క్యూ ఆపరేషన్ మొదలు కాగా, రాత్రి 9.30 గంటలకు శిశువును బోరుబావిలోంచి బయటకు తీశారు. ఐదున్నర గంటల పాటు రెస్క్యూ సిబ్బంది నిర్విరామంగా ఆపరేషన్ నిర్వహించి నవజాతశివును ప్రాణాలతో బయటకు తీసురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: విద్యార్థినిలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!
ఇక ఆపరేషన్ సమయంలో లోపల బేబీకి ఏమీ కాకుండా రెస్క్యూ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగా 100 వాట్ ఎలక్ట్రిక్ బల్బ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసింది. దాంతో లోపల శిశువుకు ఆక్సిజన్ అందడంతో పాటు బల్బు కారణంగా వెచ్చదనం లభించింది. ఇలా ఐదున్నర గంటల పాటు రెస్క్యూ సిబ్బంది కష్టపడిన తర్వాత శిశువును సురక్షితంగా బయటకు తీయడం జరిగింది. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాన్ని ప్రశంసించారు. నవజాతశిశువు ప్రాణాలతో బయటపడడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. అసలు ఆ నవజాతశిశువును బోరుబావిలో ఎవరు పడేశారనే విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మానవత్వం మరిచి ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.