Love Marriage: షాకింగ్ ఘటన.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. పేరెంట్స్ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-06-07T12:01:38+05:30 IST

ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు క్రమంగా పెరుగుతున్నాయి.

Love Marriage: షాకింగ్ ఘటన.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. పేరెంట్స్ ఏం చేశారంటే..

Love Marriage: ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే. ఈ వివాహాలను కొంతమంది పేరెంట్స్ అంగీకరించినా.. మరికొందరు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వారి పిల్లలు వారికి దూరంగా వెళ్లిపోయి పెళ్లిలు చేసుకుంటున్న ఘటనలు కూడా తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే, పెళ్లయిన తర్వాతి రోజే ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె సోదరులు వచ్చి సినీ ఫక్కిలో యువతిని ఎత్తుకెళ్లడం కలకలం సృష్టించింది.

అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని అరారియా జిల్లాలో ఉండే రూప, ఛోటు కుమార్ ఠాకుర్‌ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబం ఈ వివాహానికి ఒప్పుకోలేదు. కానీ, రూప మాత్రం అతడితోనే జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఛోటుతో పెళ్లికి ససేమీరా అన్నారు. దాంతో చేసేదేమిలేక కుటుంబ సభ్యులను కాదని ఈ నెల 2వ తేదీన ఆమె కులాంతర వివాహం చేసుకుంది.

Viral Video: 'ఇలాంటి వారికి పెళ్లెందుకు'.. వరుడిని తిట్టిపోస్తున్న నెటిజన్లు..!


ఇక ఈ విషయం తెలుసుకున్న రూప కుటుంబం కోపంతో ఊగిపోయింది. ఎలాగైనా కూతురును తమ ఇంటికి తెచ్చుకోవాలని తల్లిదండ్రులు భావించారు. అటు రూప చేసిన పనికి ఆగ్రహించిన సోదరులు సైతం పెళ్లైన తర్వాతి రోజే ఆమెను అత్తారింటిలో నుంచి బలవంతంగా బైకుపై ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఛోటు కుటంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రూప, ఆమె కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు.

Viral Video: ఇది దైవ లీలేనా..? డాక్టర్లకే అంతుచిక్కని విచిత్రం.. మూడు రోజుల పాప ఎన్ని సిత్రాలు చేస్తోందో మీరే చూడండి..!

Updated Date - 2023-06-07T12:01:38+05:30 IST