Viral Video: ఇది దైవ లీలేనా..? డాక్టర్లకే అంతుచిక్కని విచిత్రం.. మూడు రోజుల పాప ఎన్ని సిత్రాలు చేస్తోందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-06-04T11:27:34+05:30 IST
ఆ బిడ్డ పుట్టి పట్టుమని మూడు రోజులు కూడా గడవలేదు.
Baby Crawling Viral Video: ఆ బిడ్డ పుట్టి పట్టుమని మూడు రోజులు కూడా గడవలేదు. కానీ, ఆ బుడ్దది చేస్తున్న పనులు ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆ మూడు రోజల పాప ఎన్ని సిత్రాలు చేస్తోందో చూస్తే ఔరా అనాల్సిందే. ప్రస్తుతం ఆ చిన్నారి తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇది దైవ లీలేనా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు, దాని కళ్ళు మూసుకుని ఉంటాయి. వాటిని తెరవడానికి కొంచెం సమయం పడుతుంది. అలాగే ఆ శిశువు 3 నెలల్లో బోల్తా పడడం.. ఇంకో 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు నడవడం చేస్తుంది. అయితే, మనం ఇక్కడ చెప్పుకుబోయే మూడు క్రితం పుట్టిన బుడ్డది మాత్రం చాలా స్పెషల్. ఆ చిన్నారికి పైన చెప్పినట్టు వెయిటింగ్ ఇష్టం లేదేమో. సరిగ్గా కళ్లు కూడా తెరవని స్థితిలో ఉన్న ఆ బుడ్డది.. ఏకంగా తనంతటతానుగా తలపైకి ఎత్తి ముందుకు జరగడానికి ప్రయత్నిస్తుంది. మూడు రోజుల ఆ పసికందు ఆసుపత్రి బెడ్‌పై బోల్తా పడటానికి ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు. ఆ చిన్నారి తల్లినే స్వయంగా ఈ ప్రత్యేక క్షణాన్ని రికార్డ్ చేసింది. అనంతరం ఆ వీడియోను మే 25న సమంత ఎలిజబెత్ (@Samantha Elizabeth) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సమంత ఎలిజబెత్ "ఇది జరిగిందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అనే క్యాప్షన్ ఇచ్చారు.
Mango Kernel: ఎందుకూ పనికిరావని మామిడి కాయలను తినేశాక టెంకలను పారేస్తున్నారా..? ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే..!
ఇక నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'ఇందులో షాకింగ్ ఏమీ లేదని' ఒకరు, 'తల్లి పాలు తాగేందుకు వెతుకుతూ పిల్లలు ఇలా చేస్తారు' మరొకరు, 'చిన్నారి చర్యలు షాకింగ్‌గా ఉన్నాయని' ఇంకోకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. 'ఫస్ట్ ఫోన్ కింద పెట్టి బేబీకి పాలు పట్టండి' అని వ్యాఖ్యానించారు. మరొకరు 'ఇది చాలా సాధారణమైనది, ఆమె పాల కోసం వెతుకుతోంది' అని అభిప్రాయపడ్డారు. ఇంకేందుకు ఆలస్యం మూడు రోజుల బుడ్డది చేస్తున్న సిత్రాలపై మీరు ఓ లుక్కేయండి.