తల్లిదండ్రులు పొలానికి వెళ్లగానే ఇంట్లోకి వెళ్లిన కూతురు.. నగలు, నగదు కనిపించకపోవడంతో విచారించగా చివరకు షాకింగ్ ట్విస్ట్..
ABN , First Publish Date - 2023-03-12T19:32:27+05:30 IST
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.. అనేది సామెత. అప్పుడప్పుడూ చోటు చేసుకునే సంఘటనలు.. ఈ సామెతను నిజం చేస్తూ ఉంటాయి. దురవాట్లకు బానిసలైన కొందరు యువకులు.. చివరకు సొంతింట్లోనే చోరీలకు పాల్పడడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు..
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.. అనేది సామెత. అప్పుడప్పుడూ చోటు చేసుకునే సంఘటనలు.. ఈ సామెతను నిజం చేస్తూ ఉంటాయి. దురవాట్లకు బానిసలైన కొందరు యువకులు.. చివరకు సొంతింట్లోనే చోరీలకు పాల్పడడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ యువతి అందరికీ షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లగానే కూతురు ఇంట్లోకి వెళ్లింది. అయితే చివరకు ఇంట్లో నగలు, నగదు కనిపించకపోవడంతో విచారించగా షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
యూపీ (UP) బండాలోని హమీర్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన పెద్ద కూతురికి ఇటీవల వివాహం (Daughters marriage) చేశాడు. అతడి చిన్న కూతురు అక్కను చూసేందుకు తరచూ హమీర్‌పూర్ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో తన అక్క ఇంటికి సమీపంలోని యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. తల్లిదండ్రులకు చెప్పకుండా ఆమె తరచూ తన అక్కను చూసేందుకని వెళ్లి.. యువకుడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువకుడి వద్ద దబ్బులు పెద్దగా లేకపోవడంతో యువతి చివరకు మాస్టర్ ప్లాన్ వేసింది.
ఓ రోజు తల్లిదండ్రులు (parents) పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఇదే సరైన సమయం అనుకుని.. ఇంటికి వెళ్లిన యువతి, బీరువాలోని రూ.1లక్ష విలువ చేసే నగలు, రూ.15వేల నగదును (Theft of jewelry and cash) చోరీ చేసింది. అనంతరం ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బీరువాలో నగలు, నగదు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. కూతురు కూడా కనిపించకపోవడంతో చివరకు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమ జంట (love couple) కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.