Viral News: ఇది జరిమానానా? లేక అవార్డా?.. ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ పని చూస్తే పడిపడి నవ్వుతారు..
ABN , First Publish Date - 2023-07-22T20:12:12+05:30 IST
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తతం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరేమో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరేమో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రద్దీగా ఉండే బెంగళూరులో ఓ స్కూల్ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించాడు. ఆ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మెట్రో స్టేషన్ సమీపంలో యూటర్న్ తీసుకున్నాడు. దీనిని గమనించి ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘‘విద్యార్థులతో ఉన్న పాఠశాల బస్సు బ్రిగేడ్ మెట్రోపాలిటన్ నుంచి గరుడాచారాపాళ్య మెట్రో స్టేషన్‌లో తప్పుడు మార్గంలో వెళ్తోంది. ఇది బస్సులోని పిల్లలకు ప్రమాదం. దయచేసి డ్రైవర్‌కు జరిమానా విధించండి’’ అని రాసుకొచ్చాడు. సదరు పోస్ట్‌ను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశాడు.
మరుసటి రోజు కూడా సదరు బస్సు డ్రైవర్ రాంగ్ రూట్‌లోనే యూటర్న్ తీసుకున్నాడు. అది గమనించిన ట్విట్టర్ వినియోగదారుడు వీడియో తీసి మళ్లీ పోస్ట్ చేశాడు. సదరు డ్రైవర్‌పై బెంగళూరు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ట్రాఫిక్ పోలీసులు సదరు బస్సు డ్రైవర్‌కు చలాన్ వేసినట్లు బదులిచ్చారు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌కు చలాన్ అందిస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు గుప్పించడంతోపాటు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అది జరిమానాలా లేదని, ఏదో అవార్డు ఇస్తున్నట్టుగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. మరొకరేమో ‘‘డ్రైవర్ పోజ్ చూస్తే అతనికి ఇంకా పెద్ద అవార్డు రావాలని ఆశిస్తున్నట్టుగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ఆ ఫోటోను చూస్తుంటే నవ్వు ఆపులేకపోతున్నామని మరికొందరు తెలిపారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లు పోస్ట్‌లో ఇంటికి వస్తుంటాయి. లేదంటే ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. కానీ బెంగళూరు పోలీసులు చలానా కాగితాన్ని డ్రైవర్‌కు స్వయంగా అందించడంతోపాటు అవార్దు ఇస్తున్నట్టుగా ఫోటో దిగడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.