Viral Video: కొడితే సిక్సులు.. ఫోర్లే.. వైరల్‌గా మారిన 14 ఏళ్ల బాలిక వీడియో..!
ABN , First Publish Date - 2023-02-14T20:28:32+05:30 IST
ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కొందరు ఎంతో ప్రతిభ ఉన్నా మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతుంటారు. అప్పుడప్పుడూ కొందరి ప్రతిభ వెలుగులోకి వస్తుంటుంది. ప్రస్తుతం ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ..
ప్రస్తుతం మహిళలు కూడా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కొందరు ఎంతో ప్రతిభ ఉన్నా మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతుంటారు. అప్పుడప్పుడూ కొందరి ప్రతిభ వెలుగులోకి వస్తుంటుంది. ప్రస్తుతం ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతుల గురించి ప్రపంచానికి తెలుస్తోంది. ప్రస్తుతం క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న 14 ఏళ్ల బాలికపై.. సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత మహిళా క్రికెట్ టీమ్‌కు మరో ప్లేయర్ దొరికిందోచ్... అంటూ అంతా కామెంట్లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) బార్మర్ జిల్లా శివ్ షెర్పురా కనసర్ గ్రామానికి చెందిన మథార్ ఖాన్ అనే వ్యక్తికి భార్య, ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో 14ఏళ్ల ముమల్ అనే బాలిక (4-year-old girl) ప్రస్తుతం.. క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 8వ తరగతి చదువుతున్న ముమల్.. క్రికెట్‌లో (Cricket) సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా, బాలిక తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కూతురికి శిక్షణ ఇప్పించలేని పరిస్థితి. కనీసం బూట్లు కూడా కొనలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం బాలికకు పాఠశాల ఉపాధ్యాయుడే కోచ్‌గా (Cricket coach) వ్యవహరిస్తున్నాడు. ఆమెకు రోజూ మూడు, నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేయిస్తున్నాడు.
గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ముమల్ రోజూ నడుచుకుంటూ వెళ్తుంటుంది. స్కూల్లో చదువుతో పాటూ క్రికెట్ శిక్షణ (Cricket training) తీసుకునే ముమల్.. ఇంటికి రాగానే తల్లికి పనుల్లో కూడా సాయపడుతుంటుంది. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Indian cricketer Suryakumar Yadav) బ్యాటింగ్ చూసి మెలకువలు నేర్చుకున్నట్లు బాలిక చెబుతోంది. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన గ్రామీణ ఒలింపిక్స్‌లో బాలిక జట్టు పాల్గొంది. గట్టి పోటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిముషంలో ముమల్ జట్టు ఓడిపోయింది. ముమల్‌కు బంధువైన అనిస్సా అనే బాలిక కూడా క్రికెట్ ఆడుతుంటుంది. ఈమె గతంలో అండర్-19 రాజస్థాన్ జట్టుకు (rajasthan under-19 cricket team) ఎంపికైంది. అనిస్సా చూసి.. అప్పటి నుంచి ముమల్ కూడా క్రికెట్‌పై ఇష్టం పెంచుకుంది. అనిస్సాను స్ఫూర్తిగా తీసుకున్న ముమల్.. తర్వాత ఆమె సలహాలు కూడా తీసుకుంటూ మ్యాచ్ ప్రాక్టీస్ చేసేది.
కాగా, ముమల్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ (Viral videos) అయ్యాయి. దీంతో పలువురు ప్రముఖులు.. ముమల్ ప్రతిభను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముమల్ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP state president) సతీష్ పూనియా చలించిపోయారు. ముమల్ ప్రతిభను ప్రశంసిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అలాగే ముమల్‌కు క్రికెట్ కిట్‌ను (Cricket Kit) పంపించారు. అలాగే ముమల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలో భారత మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముమల్ పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చింది. గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ సహా వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సతీష్ పూనియా హామీ ఇచ్చారు.
Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...