Aadhaar Card: ప్రధాన మంత్రి లోన్ స్కీమ్.. ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు రూ.3 లక్షలు ఇస్తారట.. ఇందులో నిజమెంతంటే..!

ABN , First Publish Date - 2023-08-17T21:19:56+05:30 IST

ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. ట్రెండింగ్‌లో ఉన్న అంశాల్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకొని, ప్రజల్ని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకొస్తున్న స్కీమ్‌లను సైతం వీళ్లు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి...

Aadhaar Card: ప్రధాన మంత్రి లోన్ స్కీమ్.. ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు రూ.3 లక్షలు ఇస్తారట.. ఇందులో నిజమెంతంటే..!

ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అడ్డం పెట్టుకొని సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు. ట్రెండింగ్‌లో ఉన్న అంశాల్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకొని, ప్రజల్ని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకొస్తున్న స్కీమ్‌లను సైతం వీళ్లు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి వారు ఇచ్చే ప్రకటనలన్నీ ఫేక్ అనే విషయం మోసపోయేవరకూ తెలీదు. లేటెస్ట్‌గా సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గంలో కుచ్చటోపీ పెడుతున్నారు. ఇటీవల ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రధాన మంత్రి స్కీమ్ కింద రూ.3లక్షల లోన్ ఇస్తారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ ఇలాంటి లోన్ అంటూ ఒకటి ఉందా.. ఇందులో నెజమెంత.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

‘‘ప్రధాన మంత్రి రుణ పథకం (Prime Minister's Loan Scheme) కింద ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3లక్షల రుణం’’.. ఈ మెసేజ్ ఇటీవల చాలా మంది ఫోన్లలో దర్శనమిస్తోంది. దీన్ని చూసి ఎంతో మంది ఇది నిజమేమో అని ఎంతో సంబరపడిపోతున్నారు. అయితే ఇదంతా ఓ ఫేక్ మెసేజ్ (Fake message) అని తేలిపోయింది. ‘‘PIB ఫాక్ట్ చెక్’’ ట్విట్టర్ ఖాతాలో ఇదే అంశంపై క్లారిటీ ఇస్తూ పోస్టు చేశారు. ఆధార్ కార్డుపై రూ.3లక్షల లోన్ (3 lakhs loan scheme) వార్త పూర్తిగా అబద్ధమని తేల్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఎలాంటి సమాచారాన్నీ షేర్ చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఇలాంటి పథకాలేవీ కేంద్ర ప్రభుత్వం (Central Govt) అమలు చేయడం లేదని తెలిసింది.

Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో.. ఆర్మీ జవాన్‌కు కుటుంబ సభ్యులు ఎలా స్వాగతం పలికారో చూస్తే..!

adhar-lons.jpg

కొందరు సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) ఇలాంటి మెసేజ్‌లతో అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తూ ఉంటుంది. ఇందులో కూడా ఆధార్ కార్డు ద్వారా మాత్రమే రుణాలు ఇవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ముద్రా రుణాలను వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇస్తుంటాయి. వీటిని పొందేందుకు లబ్ధిదారులు తమ ఆధార్, పాన్ కార్డులను (Aadhaar, PAN card) రుజువుల కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Viral: కనివినీ ఎరుగని వింత కేసు.. కొడుకు బర్త్ సర్టిఫికెట్‌లో భర్త పేరును తీసేసి.. ప్రియుడి పేరును చేర్చండంటూ..!

Updated Date - 2023-08-17T21:22:02+05:30 IST