అదృష్టం అంటే ఇతడిదే.. సైబర్ నేరగాళ్లు దోచేసిన రూ.2.29 లక్షలను పోలీసులు ఎలా బ్యాంకులోకి మళ్లీ తెప్పించారంటే..
ABN , First Publish Date - 2023-01-03T18:30:35+05:30 IST
తాము బ్యాంకు అధికారుల మంటూ కొన్నిసార్లు, ఏటీఎం, క్రెడిట్ కార్డులకు సంబంధించిన సిబ్బందిమంటూ మరికొన్నిసార్లు ఫోన్లు చేస్తారు. బ్యాంక్ ఖతా, ఓటీపీ వివరాలు తెసుకుంటారు. మరుక్షణంలో మన ఖాతాలోని సొమ్మును లూటీ చేసేస్తారు. ఈ తరహా కేసులు..
తాము బ్యాంకు అధికారుల మంటూ కొన్నిసార్లు, ఏటీఎం, క్రెడిట్ కార్డులకు సంబంధించిన సిబ్బందిమంటూ మరికొన్నిసార్లు ఫోన్లు చేస్తారు. బ్యాంక్ ఖతా, ఓటీపీ వివరాలు తెసుకుంటారు. మరుక్షణంలో మన ఖాతాలోని సొమ్మును లూటీ చేసేస్తారు. ఈ తరహా కేసులు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కసారి మోసపోతే.. పోయిన నగదు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తిని అదృష్టం వరించిందనే చెప్పొచ్చు. సైబర్ నేరగాళ్లు దోచేసిన రూ.2.29 లక్షలను.. పోలీసులు తిరిగి తెప్పించారు. వివరాల్లోకి వెళితే..
నాకు ఈ పెళ్లి వద్దంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న యువకుడు.. అసలు నిజాలేంటో బయటపెట్టిన యువతి..!
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీఘర్ పరిధి కున్వర్ నగర్ కాలనీలో నివసిస్తున్న సతీష్ కుమార్ గోస్వామికి డిసెంబర్ 28న ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తనని తాను క్రెడిట్ కార్డుకు (Credit card) సంబంధించిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం గోస్వామికి బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను అడిగాడు. అతన్ని నమ్మిన గోస్వామి.. తన వివరాలు మొత్తం చెప్పేశాడు. తర్వాత గోస్వామి మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను (OTP) కూడా తెలుసుకున్నాడు. కాసేపటి తర్వాత బ్యాంక్ ఖాతా చెక్ చేసుకున్న గోస్వామి షాక్ అయ్యాడు. తన ఖాతాలో రూ.2.29లక్షలు మాయమవడంతో లబోదిబోమంటూ సైబర్ క్రైం (Cyber crime) పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే యాక్షన్‌లోకి దిగారు. సదరు బ్యాంకు అధికారులను సంప్రదించి, మేమెంట్ గేట్‌వే (Payment gateway) సాయంతో చెల్లింపును నిలిపేశారు. అనంతరం బాధితుడికి తిరిగి నగదు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన వివరాలు, ఓటీపీ తదితరాలను షేర్ చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి మోసాలపై 1930 లేదా సైబర్ క్రైమ్ అధికారిక వెబ్‌సైట్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..