మూడేళ్ల కూతుర్ని చంపి ఓ తల్లి ఆత్మహత్య.. ఆమె పొట్టకు ప్లాస్టర్‌తో అంటించి ఉందో కాగితం.. పోలీసులు ఓపెన్ చేసి చూస్తే..
ABN , First Publish Date - 2023-02-08T18:06:03+05:30 IST
మూడేళ్ల కూతురంటే ఆ తల్లికి ఎంతో అభిమానం. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అయితే అనుకోని పరిస్థితిల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకపోతే కూతురు భవిష్యత్ ఏంటనే ఆందోళన చెందింది. చివరకు..
మూడేళ్ల కూతురంటే ఆ తల్లికి ఎంతో అభిమానం. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అయితే అనుకోని పరిస్థితిల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను లేకపోతే కూతురు భవిష్యత్ ఏంటనే ఆందోళన చెందింది. చివరకు కూతుర్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతురాలి పొట్టకు ప్లాస్టర్‌తో అంటించి ఉన్న కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఓపెన్ చేయగా చివరకు అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని (Haryana) హిసార్ పరిధి కులేరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయేందర్ అనే వ్యక్తికి.. భార్య కవిత, మూడేళ్ల కూతురు జియా ఉన్నారు. విజయేందర్ స్థానికంగా ఉన్న మెడికల్ కళాశాలలో పని చేస్తుంటాడు. ఇన్నాళ్లూ బాగున్న విజయేందర్ ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. వివిధ సాకులు చూపుతూ భార్యను (Harassment of wife) వేధించేవాడు. ఇటీవల విజయేందర్ సోదరుడు, అతడి భార్య కూడా కవితను వేధించడం మొదలెట్టారు. ఇన్నాళ్లూ భరించిన ఆమెకు.. భర్త కుటుంబ సభ్యుల తీరుతో జీవితంపైనే విరక్తి చెందింది. కవితకు తన కుమార్తె (daughter) జియా అంటే ఎంతో ఇష్టం. పాప సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్నాళ్లూ అన్నీ భరించింది.
అయితే చివరకు చనిపోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే కూతురు భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన చెందింది. దీంతో చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కూతురును చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని (Suicide decision) భావించింది. భర్త, బావ, అతడి భార్య వేధింపులతో జీవితంపై విరక్తి పుట్టిందని, దీంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని.. సూసైడ్ నోట్ (Suicide note) రాసుకుని, పేపర్‌ను కడుపుపై అంటించుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం కడుపుపై ఉన్న పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా మృతురాలి భర్త, కుటుంబ సభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.