ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. తలుపులు పగలగొట్టి ఇల్లంతా వెతికినా వీడని మిస్టరీ.. బెడ్రూంలోని పరుపులో కనిపించిన సీన్ చూసి..!

ABN , First Publish Date - 2023-02-15T18:33:09+05:30 IST

ఆ ఊర్లో ఎప్పుడూ లేనిది ఓ రోజు దుర్వాసన రావడం మొదలైంది. దీంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. అయితే తలుపులకు తాళాలు వేసి ఉండడంతో తెరిచే ధైర్యం ఎవరూ చేయలేదు. చివరకు ..

ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. తలుపులు పగలగొట్టి ఇల్లంతా వెతికినా వీడని మిస్టరీ.. బెడ్రూంలోని పరుపులో కనిపించిన సీన్ చూసి..!
ప్రతీకాత్మక చిత్రం

ఆ ఊర్లో ఎప్పుడూ లేనిది ఓ రోజు దుర్వాసన రావడం మొదలైంది. దీంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. అయితే తలుపులకు తాళాలు వేసి ఉండడంతో తెరిచే ధైర్యం ఎవరూ చేయలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే ఇల్లంతా వెతికినా మిస్టరీ వీడలేదు. చివరకు బెడ్రూంలో వెతగ్గా పరుపు వద్ద షాకింగ్ సీన్ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర (Maharashtra) పాల్ఘర్ జిల్లా పరిధి నాలా సోపారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన హార్దిక్ షా అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన మేఘా(37) అనే మహిళ (woman) పరిచయమైంది. మేఘా స్థానింకగా ఉన్నఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. హార్దిక్ నిరుద్యోగి కావడంతో అతడి ఖర్చులన్నీ మేఘానే భరిస్తూ వచ్చింది. మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం (Live in relationship) చేస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్.. తన తండ్రి ఖాతా నుంచి రూ.40లక్షలు విత్‌డ్రా చేసి ఖర్చు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఇంటి నుంచి గెంటేశారు.

సులభ్ కాంప్లెక్స్‌లో తుపాకీని మర్చిపోయి వెళ్లిపోయిన పోలీసు.. 15 నిమిషాల తర్వాత గుర్తుకొచ్చి తిరిగొచ్చి చూస్తే..

couple-crime.jpg

నెల రోజుల క్రితం హార్దిక్.. తన ప్రియురాలితో (girlfriend) కలిసి ఓ అద్దె ఇంట్లోకి మారాడు. ఇద్దరూ కొన్నాళ్లు ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండే హార్దిక్.. ఖర్చుల కోసం మేఘాను వేధిస్తూ ఉండేవాడు. దీంతో ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు (quarrels) మొదలయ్యాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. డబ్బులు ఇచ్చేందుకు మేఘా నిరాకరించడంతో హార్దిక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మేఘా తీవ్రంగా వ్యతిరేకించడంతో మరింత ఆగ్రహానికి గురై.. ఆమెపై దాడి (attack) చేసి హత్య చేశాడు.

Valentines Day: పార్కులో కూర్చున్న భార్యాభర్తలు.. ప్రేమికులేమోనని భావించిన భజరంగ్‌ దళ్ కార్యకర్తలు.. చివరకు ఊహించని సీన్..!

maharastra-crime-news.jpg

అనంతరం మృతదేహాన్ని పరుపు కింద దాచిపెట్టి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. లోపల ఎక్కడ వెతికినా మృతదేహం కనిపించలేదు. చివరకు పరుపు కింద చూసి అంతా షాక్ అయ్యారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొబైల్ నంబర్ ఆధారంగా హార్దిక్‌ని గుర్తించారు. రాజస్థాన్ పారిపోతున్న ముంబై నుంచి రాజస్థాన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

రైల్లోంచి ప్రయాణీకులంతా దిగినా ఎవరూ తీసుకెళ్లని ట్రంకు పెట్టె.. కిందకు దించి తాళాలు పగలగొడితే లోపల కనిపించిన దృశ్యం చూసి..!

Updated Date - 2023-02-15T18:43:16+05:30 IST