Ram Charan: ఇది నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్

ABN , First Publish Date - 2023-03-03T11:28:43+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Ram Charan: ఇది నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.. చెర్రీ ఎమోషనల్ పోస్ట్
Ram Charan

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా.. వరల్డ్ వైడ్‌గా ఉన్న వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)ని ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ హాలీవుడ్‌కి ఆహ్వానించినట్లు ప్రచారం కూడా జరిగింది. అలాగే.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం ఈ మూవీకి దక్కాయి.

‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి అయితే సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే ఇటీవలే జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’కి ఐదు అవార్డులు దక్కాయి. ఈ వేడుక కోసమే కొన్ని రోజుల క్రితం ఈ చిత్రబృందం అమెరికాకి వెళ్లింది. అందులో రామ్‌చరణ్ కూడా ఉన్నాడు. ఈ తరుణంలోనే ఈ సినిమాని అక్కడి పాపులర్ ఏస్ హోటల్‌లో ప్రత్యేకంగా స్ర్కీనింగ్ చేశారు. అక్కడ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి రామ్ ‌చరణ్ (Ram Charan) ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని షేర్ చేశాడు.

RRR.jpg

చెర్రీ షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘ ఏస్ హోటల్‌లో #RRR స్క్రీనింగ్‌కి చాలా మంచి స్పందన వచ్చింది! అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ అందరి నుంచి ఇలా స్టాండింగ్ ఒవేషన్ అందుకోవడం నా మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంది!! అందరికీ ధన్యవాదాలు’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్ రాజమౌళి, కీరవాణీ (Keeravani) కూడా పాల్గొన్నారు. అయితే.. సోదరుడు తారకరత్న ఆకస్మిక మరణం కారణంగా ఎన్టీఆర్ హెచ్‌సీఏ అవార్డుల వేడుకకి వెళ్లలేకపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-03T11:28:43+05:30 IST