Green Comet 2023: ఖగోళంలో అరుదైన ఘట్టం.. రేపే అద్భుతం ఆవిష్కృతం!

ABN , First Publish Date - 2023-01-31T19:53:37+05:30 IST

ఖగోళంలో సంభవించే ఘట్టాలేవైనా అద్భుతమే.. ఇక అరుదుగా సాక్షాత్కరించే దృశ్యాలైతే అందరికీ ఆసక్తిదాయకమే.. అచ్చంగా ఇలాంటి ఘట్టమే ఒకటి బుధవారం (1, ఫిబ్రవరి 2023) కనులవిందు చేయబోతోంది.

Green Comet 2023: ఖగోళంలో అరుదైన ఘట్టం.. రేపే అద్భుతం ఆవిష్కృతం!

ఖగోళంలో సంభవించే ఘట్టాలేవైనా అద్భుతమే.. ఇక అరుదుగా సాక్షాత్కరించే దృశ్యాలైతే అందరికీ ఆసక్తిదాయకమే.. అచ్చంగా ఇలాంటి ఘట్టమే ఒకటి బుధవారం (1, ఫిబ్రవరి 2023) కనులవిందు చేయబోతోంది. ఖగోళశాస్త్రవేత్తలు (astronomers), ఔత్సాహికులకు అత్యంత ఎక్కువగా కనిపించనున్న అరుదైన ఒక పచ్చవర్ణం తోకచుక్క2023 (Green Comet) భూమికి సమీపం పయనించనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ ఘట్టం బుధవారం జరగబోతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) తెలిపింది. భూమికి 26.4 మిలియన్ మైళ్ల దూరంలో ఇది ప్రయాణించనుందని, కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు మళ్లీ ఇలాంటి అద్భుతం జరగకపోవచ్చునని అంచనా వేసింది. ఈ తోకచుక్క ఫార్ములా పేరు C/2022 E3 (ZTF) గా నాసా వెల్లడించింది.

ఎప్పుడు కనిపిస్తుంది?

జనవరి నెల మొత్తం భూమికి ఆగ్నేయ దిశలో పయనించిన తోకచుక్క (Comet) ఫిబ్రవరి 1, 2 తేదీల మధ్య సమీపం నుంచి వెళ్లనుంది. సాధారణంగా తోకచుక్కలను అంచనా వేయలేమని, అయితే ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మాత్రం తోకచుక్క చాలా ప్రకాశవంతంగా దర్శనమివ్వనుందని నాసా (NASA) తెలిపింది. బైనాక్యులర్స్‌తో వీక్షించొచ్చునని సూచించింది. అయితే ఎలాంటి అవరోధాలు లేని చిమ్మచీకట్లో ఉంటే మాత్రమే కళ్లతో ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఉండదని తెలిపింది.

Untitled-5.jpg

కాగా ఈ తోకచుక్కను మార్చి 2, 2022న గుర్తించారు. శాండియాగోలోని కాల్‌టెక్ పాలోమర్ అబ్సర్వేటరీ వద్దనున్న ‘జ్విక్కీ ట్రాన్సిట్ ఫెసిలిటీ టెలిస్కోప్‌’ను ఉపయోగించి కనుగొన్నారు. రసాయనాల కలయిక కారణంగా ఈ తోకచుక్క పచ్చరంగుకు కారణంగా ఉంది. తోకచుక్క కోమాలో (Coma) సూర్యకాంతి, కర్భన ఆధారిత కణాలు ఢీకొట్టుకొనడం కారణంగా ఈ వర్ణం ఏర్పడుతుందని తెలిపింది. కాగా ఈ తోకచుక్కను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో (JWST) పరిశీలించాలని భావిస్తున్నట్టు తెలిపింది.

Updated Date - 2023-01-31T21:37:01+05:30 IST