Shocking: మూగజీవాలపై పైశాచికత్వం.. ఆపై టార్చర్ చేసి చంపడం.. వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్ శాడిజం..!
ABN , First Publish Date - 2023-09-27T13:53:55+05:30 IST
ప్రముఖ బ్రిటీష్ జీవశాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్‌బరోతో కలిసి పనిచేయడంతో వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్ ఆడమ్ బ్రిటన్ (Adam Britton) బాగా పాపులర్ అయ్యాడు. అయితే, తాజాగా ఇతడి గురించి బయటి ప్రపంచానికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతడు ఒక మానవ మృగమని తెలియడంతో అందరు నిర్ఘాంతపోయారు.
Shocking: ప్రముఖ బ్రిటీష్ జీవశాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్‌బరోతో కలిసి పనిచేయడంతో వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్ ఆడమ్ బ్రిటన్ (Adam Britton) బాగా పాపులర్ అయ్యాడు. అయితే, తాజాగా ఇతడి గురించి బయటి ప్రపంచానికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతడు ఒక మానవ మృగమని తెలియడంతో అందరు నిర్ఘాంతపోయారు. ఈ నీచుడు డజన్ల కొద్ది శునకాలపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆపై వాటిని టార్చర్ చేసి చంపేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో (Australia) తన నేరాన్ని అంగీకరించాడు ఆడమ్.
వెస్ట్ యార్క్‌షైర్‌కు (West Yorkshire) చెందిన ఆడమ్ బ్రిటన్ దాదాపు 40 పెంపుడు కుక్కలను రేప్ చేసి చంపినట్లు తేలింది. ఇతడి నేరాలు 2014లో ప్రారంభమయ్యాయి. ఈ మానవ మృగం తన ప్రాపర్టీలో షిప్పింగ్ కంటైనర్‌కు “టార్చర్ రూమ్”( Torture Room ) అని ఓ పేరు పెట్టాడు. అక్కడే మూగజీవాలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. డార్విన్ సమీపంలోని అతడి తాలూకు ప్రాపర్టీపై దాడి చేసిన సమయంలో కంప్యూటర్లు, కెమెరాలు, సెక్స్ టాయ్‌లతో కూడిన కంటైనర్‌ను పోలీసులు గుర్తించారు.
కుక్కలను (Dogs) తెచ్చుకొని వాటిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఆపై వాటిని తీవ్రంగా హింసించి చంపేసేవాడు. తన క్రూరమైన చర్యల వీడియోలను టెలిగ్రామ్ (Telegram) లో తనలాంటి ఇతర వ్యక్తులతో కూడా పంచుకున్నాడు. ఎట్టకేలకు ఈ నీచుడి గురించి పోలీసులకు తెలియడంతో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో ఆడమ్ మాట్లాడుతూ.. తాను అలాంటి పనులు చేయకుండా ఉండాలని ఎంతో ట్రై చేశానని చెప్పాడు. కానీ, అది తన వల్ల కాలేదని చెప్పుకొచ్చాడు.
"నేను నా కోరికలను చాలా కాలం అణచి వేశాను. కొంతకాలం తర్వాత మళ్లీ మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ పనులను ఆపలేను. ఆపాలని కూడా అనుకోవడం లేదు" అని అతడు చెప్పిన మాటలు న్యాయమూర్తిని నిర్ఘాంతపోయేలా చేశాయి. ఇంత భయానకమైన వ్యక్తి బ్రిటన్ చార్లెస్ డార్విన్ యూనివర్సిటీలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉండడం గమనార్హం. బీబీసీ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీలో అతడు తన పెంపుడు మొసలి స్మాగ్‌ను కూడా ప్రదర్శించాడు. ప్రస్తుతం ఆడమ్ బ్రిటన్ కేసు కోర్టులో విచారణదశలో ఉంది.