SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాంక్ నుంచి కీలక ప్రకటన.. బ్రాంచ్‌కు వెళ్లి చేయించుకోండి...

ABN , First Publish Date - 2023-06-06T22:11:38+05:30 IST

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(SBI). పెద్ద సంఖ్యలో బ్రాంచులతో దేశం నలుమూలలా ఈ బ్యాంకు విస్తృతంగా సర్వీసులు అందిస్తోంది. కస్టమర్ల ప్రయోజనార్థం లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన నిబంధనలను ప్రవేశపెట్టే ఈ బ్యాంకు తాజాగా ఖాతాదారుల కోసం మరో కీలక సూచన చేసింది.

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాంక్ నుంచి కీలక ప్రకటన.. బ్రాంచ్‌కు వెళ్లి చేయించుకోండి...

ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(SBI). పెద్ద సంఖ్యలో బ్రాంచులతో దేశం నలుమూలలా ఈ బ్యాంకు విస్తృతంగా సర్వీసులు అందిస్తోంది. కస్టమర్ల ప్రయోజనార్థం లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన నిబంధనలను ప్రవేశపెట్టే ఈ బ్యాంకు తాజాగా ఖాతాదారుల కోసం మరో కీలక సూచన చేసింది. లాకర్ కలిగివున్న కస్టమర్లు తాము కాంట్రాక్ట్ కలిగివున్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సవరించిన లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం (SBI locker update) చేయాలని సూచించింది. లాకర్ కలిగివున్నవారు సంతకం చేసి... అప్‌డేట్ చేసిన లాకర్ అగ్రిమెంట్‌ను మరోసారి సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 31,2023 తేదీ కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది.

‘‘ కస్టమర్ హక్కులను పొందుపరుస్తూ సవరించిన/అనుబంధ లాకర్ అగ్రిమెంట్‌ను బ్యాంక్ జారీ చేసింది. ఎస్‌బీఐలో లాకర్ సిస్టమ్ సౌలభ్యాన్ని పొందిన కస్టమర్లు సంబంధిత బ్రాంచ్‌ను సంప్రదించాలని కోరుతున్నాం. సవరించిన/అనుబంధ లాకర్ అగ్రిమెంట్‌ వర్తించేలా చూసుకోవాలి’’ అని పేర్కొంది.

కాగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) పరిశీలించిన అప్‌డేటెడ్ లాకింగ్ అగ్రిమెంట్‌ను బ్యాంకులన్ని అనుసరించాలని ఆర్బీఐ కోరింది. నిర్దేశిత గడువులోగా కస్టమర్లతో ఒప్పందాలపై సంతకం చేయించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు 23 జనవరి 2023న సర్క్యూలర్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-09T21:17:26+05:30 IST