Viral Video: చిన్నారీ.. నీకు హ్యాట్సాఫ్ తల్లీ.. ఓ కాలు లేకున్నా పరుగు పోటీల బరిలోకి దిగి.. ఓడిపోయానని తెలిసినా కూడా..!
ABN , First Publish Date - 2023-06-14T13:39:34+05:30 IST
మన సంకల్పబలం గట్టిదైతే ఎన్ని అడ్డంకులు ఎదురైన సరే.. వాటన్నింటినీ దాటుకుని మరి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాం.
Viral Video: మన సంకల్పబలం గట్టిదైతే ఎన్ని అడ్డంకులు ఎదురైన సరే.. వాటన్నింటినీ దాటుకుని మరి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాం. ఇది ఎవరు కాదలేని వాస్తవం. ఇక అంగవైకల్యం ఉన్నవారికి సాధించాలనే పట్టుదల, కసి కూసీంత ఎక్కువగానే ఉంటాయి. ఎంతలా అంటే.. తమ అంగవైకల్యాన్ని సాకుగా చూపి తమపై జాలి చూపించే అవకాశం ఎదుటివారికి ఇవ్వకూడదనే అంతలా. ఇదే కోవకు చెందిన ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) హల్‌చల్ చేస్తుంది.
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఒక కాలులేని ఓ చిన్నారి (Specially Abled) ఒక పరుగు పందేంలో పాల్గొనడం మనం వీడియోలో చూడొచ్చు. పైగా ఆమె పోటీపడింది ఎలాంటి అంగవైకల్యంలేని తోటివారితో. తాను ఆ పరుగుల పోటీలో (Race) ఓడిపోతానని తెలిసి కూడా ఆ చిన్నారి అందులో పాల్గొనడమనేది ఆమె పట్టుదలకు నిదర్శనం. నేను తోటివారికి పోటీ ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ ఆమె సొంతం. అంతేనా.. ఒంటికాలితోనే చివరి వరకు పరిగెత్తి ఆ రేసును పూర్తి చేసిందా పాప. ఆమె ఆ పరుగు పందెంలో ఓడినప్పటికీ అక్కడివారి మనసును మాత్రం గెలిచింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ ఈ ఈవెంట్ తాలూకు వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోకు 7.7 మిలియన్ల వ్యూస్ వచ్చి పడ్డాయి. చిన్నారిపై 'గొప్ప పోరాట యోధురాలు', 'నీకు హ్యాట్సాఫ్ తల్లీ' అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.