OYO Rooms: ఓయో రూమ్ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..
ABN , First Publish Date - 2023-04-20T20:50:14+05:30 IST
ఓ మహిళ ఓయో రూమ్‌లో చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉన్నా మొదట చాలా మందికి అనుమానం రాలేదు. దీనంగా కూర్చుని ఉన్న ఆమె కాసేపటికి ఏడుపులు మొదలెట్టింది. దీంతో అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది కంగారుగా లోపలికి వెళ్లారు. ఏడుస్తున్న ఆమెను..
ఓ మహిళ ఓయో రూమ్‌లో చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉన్నా మొదట చాలా మందికి అనుమానం రాలేదు. దీనంగా కూర్చుని ఉన్న ఆమె కాసేపటికి ఏడుపులు మొదలెట్టింది. దీంతో అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది కంగారుగా లోపలికి వెళ్లారు. ఏడుస్తున్న ఆమెను ఓదార్చి.. ఏమైందమ్మా! అని ప్రశ్నించారు. ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. చివరకు సదరు యువతికి చార్జీలకు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బదౌన్ జిల్లా బిల్సీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి (young woman) .. ఇదే ప్రాంతానికి చెందిన ఆషిక్ హాసన్‌తో రెండున్నరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆషిక్ బుద్ధి పక్కదారి పట్టింది. ఓ రోజు మాట్లాడాలని చెప్పి ఆమెను బదౌన్ సమీపంలోని ఓయో హోటల్‌కి (Oyo Hotel) తీసుకెళ్లాడు. అందులో ఓ గదిని బుక్ చేసుకున్నాడు. వెయిటర్‌కు వెయ్యి రూపాయల లంచం ఇచ్చి ప్రియురాలిని గదిలోకి తీసుకెళ్లాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి (Indecent behavior) పాల్పడ్డాడు.
పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆమెతో గడిపాడు. అనంతరం చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సడన్‌గా ప్రియుడు కనిపించకపోవడంతో ఆమె షాక్ అయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడకపోవడంతో గదిలోనే కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె ఏడుపులు విన్న హోటల్ సిబ్బంది (Hotel staff) లోపలికి వెళ్లి విచారించారు. విషయం తెలుసుకుని ఆమెకు బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే ఆమె నేరుగా ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లి.. పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ గొడవ పెట్టుకుంది.
దీంతో ఆగ్రహానికి గురైన ఆషిక్ కుటుంబ సభ్యులు ఆమెపై దురుసుగా ప్రవర్తించి, అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మోసపోయానని తెలుసుకున్న ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన ప్రియుడు మోసం చేశాడని, ఎలాగైనా తనతోనే వివాహం జరిగిపించాలని వేడుకుంది. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.