Success Story: 8 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి విసుగొచ్చి రిజైన్ చేశాడు.. ఇప్పుడు రూ.21 కోట్ల వ్యాపారానికి యజమాని..!
ABN , First Publish Date - 2023-07-07T18:24:37+05:30 IST
8ఏళ్ళ పాటు బ్యాంకు ఉద్యోగం చేసి విసిగిపోయి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత అతనెంచుకున్న దారి ఇప్పుడతన్ని రూ.21 కోట్ల వ్యాపారానికి యజమానిని చేసింది. అసలింతకూ అతనేం చేశాడు. అచ్చంగా ఆంధ్రప్రదేశ్ లోని కరువు ప్రాంతమైన రాయలసీమలో అనంతపురం జిల్లా, పెనుకొండ పరిసర కేంద్రంగా ఇతను చేసిన అద్బుతం ఏంటి?
సక్సెస్ ఎవడి సొత్తు కాదు, కానీ ఎలా సక్సెస్ కావాలో చాలా మందికి తెలీదు. కొందరు చేతిలో ఉన్న మంచి అవకాశాన్ని వదిలేస్తుంటే వాళ్లను పిచ్చోళ్ళలాగా చూస్తుంటారు. కర్ణాటకకు చెందన అమిత్ కిషన్ వైపు కూడా ఇలాగే చూశారందరూ. చిక్కబళ్ళాపూర్ కు చెందిన ఇతను 8ఏళ్ళ పాటు బ్యాంకు ఉద్యోగం చేసి విసిగిపోయి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత అతనెంచుకున్న దారి ఇప్పుడతన్ని రూ.21 కోట్ల వ్యాపారానికి యజమానిని చేసింది. అసలింతకూ అతనేం చేశాడు. అచ్చంగా ఆంధ్రప్రదేశ్ లోని కరువు ప్రాంతమైన రాయలసీమలో అనంతపురం జిల్లా, పెనుకొండ పరిసర కేంద్రంగా ఇతను చేసిన అద్బుతం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
కర్ణాటక(Karnataka) రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ కు చెందిన అమిత్ కిషన్ పుట్టి పెరిగింది, పాఠశాల చదువు సాగించింది చిక్కబళ్ళాపూర్ లోనే. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అమిత్ కూడా అందుకు తగ్గట్టు బ్యాంక్ ఉద్యోగం(bank job) సంపాదించాడు. ఇందులో భాగంగా ఐసిఐసిఐ(ICICI), బజాజ్(Bajaj), యాక్సిస్(Axis), హెచ్‌డిఎఫ్‌సి(HDFC), పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) వంటి అనేక బ్యాంకులతో కలసి పనిచేశాడు. అయితే అమిత్ తాతగారు రైతు. అమిత్ చిన్నప్పుడు వాళ్ల తాతగారితో కలసి పొలాల్లోకి వెళ్ళి మట్టితో ఆడుకునేవాడు. ఈ కారణంగా అతనికి తాత అన్నా, మట్టి అన్నా ఎనలేని మమకారం ఏర్పడింది. అతను బ్యాంక్ ఉద్యోగం చేసినా తన మూలాలు మాత్రం మరచిపోలేదు. ఈ క్రమంలో అమిత్ దగ్గర ఇన్సురెన్స్ చేసిన ఒక క్లయింట్ క్యాన్సర్ తో మరణించాడు. ఆ సంఘటన అమిత్ లో బలమైన ముద్ర వేసింది. 'డబ్బు సంపాదించుకుంటున్నాం కానీ,ఎంత నాణ్యత కలిగిన ఆహారం తింటున్నాం?' అనే ప్రశ్న అతన్ని వేధించడం మొదలుపెట్టింది. దీంతో అతను ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. తన తాతగారి ఊరైన చిక్కబళ్ళాపూర్ లో వారికున్న పొలంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కానీ వారికి వ్యవసాయం గురించి అవగాహన లేదు. పక్క పొలంలో రైతులు పచ్చిమిర్చి వేస్తే వీళ్ళు వేరుశనగ వేశారు. వారు వేరే పంటలు వేస్తే వీరు మరొక పంట వేసేవారు. వీరికి ఖరీఫ్, రబీ సీజన్ ల గురించి ఏమీ తెలియదు. దీంతో వైఫల్యం వెక్కిరించింది. ఆ తరువాత మూడేళ్ళ పాటు వ్యవసాయం గురించి తెలుసుకోవడంలోనే గడిపారు.
Big Mistake: షాపింగ్ మాల్స్‌లో ఎస్కలేటర్‌పై పిల్లల్ని తీసుకెళ్తున్నారా..? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి..!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం, అనంతపురం(Anantapur) జిల్లా కరువు ప్రాంతమైనా.. పెనుగొండ(penukonda) పరిసరాల్లో హంద్రీ నీవా కాలువల ద్వారా నీటి వసతి బానే ఉంది. ఈ కారణంగా వీరు పెనుకొండ ప్రాంతంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. సేంద్రీయ వ్యవసాయం పండించాలనేది వీరి కల. కానీ తోటి రైతుల సహకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. పైగా రసాయనాల వల్ల నిర్జీవంగా మారిన భూమిని తిరిగి పోషకాలతో నింపడం పెద్ద సవాల్. ఇందుకోసం అమిత్ భూమిని నాలుగు అడుగుల లోతు తవ్వాడు. ఆ భూమిలో ఆవు పేడ, ఆవు మూత్రం, అరటిపండ్లు ఉపయోగించాడు. ప్రతి ఎకరాకు 4నుండి 5 ఆవులను వినియోగించాడు. ఆ పొలంలో ఆవులు స్వేచ్చగా మూత్రం, పేడ వేసేవి. ఇలా తన పొలాన్ని శక్తివంతంగా మార్చుకున్నాడు. వీరి ప్రయత్నం ఫలించి మట్టిలో వానపాములు తిరిగి కనిపంచడం మొదలుపెట్టాయి. ఇలా క్రమంగా ఈ భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఇతనికి ఇతని తమ్ముడు, వీరి భార్యలు సహకారం అందించారు.
1.5కోట్ల రుణంతో 15ఎకరాల వ్యవసాయ భూమితో మొదలుపెట్టి ఈరోజు 660ఎకరాలలో వీరి సేంద్రీయ వ్యవసాయ ప్రస్థానం విస్తరించింది. ఈ పొలాల్లో ఆవులు ఎంతో స్వేచ్చగా తిరుగుతుంటాయి. అమిత్ దగ్గర ఇప్పుడు వివిధ 700 రకాల దేశవాళీ ఆవులు, గేదెలు ఉన్నాయి(700 types cows and bulls). వీటినుండి వేల లీటర్ల స్వచ్చమైన పాలు, నెయ్యి, వెన్న లభ్యమవుతాయి. ప్రతిరోజూ వీటిని బెంగుళూరుకు తరలించి అమ్ముతున్నారు. సుమారు 30సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల సలహాలతో సాగుతున్న హెబ్పేవు ఫామ్స్, హెబ్బేవు సూపర్ మార్కెట్ గా కూడా అవతరించింది. 2019లో మొదలైన హెబ్బేవు.. ఇప్పుడు రూ.21 కోట్ల ఆదాయంతో భారతదేశంలో అత్యంత పెద్ద సేంద్రీయ వ్యవసాయం సాగిస్తున్న సంస్థలలో ఒకటిగా ఉంది.