Viral News: ఒకరికి 25 ఏళ్లు.. మరొకరికి 50 ఏళ్ల వయసు.. ఇద్దరూ తల్లీకూతుళ్లే.. సడన్‌గా ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..
ABN , First Publish Date - 2023-05-16T15:49:18+05:30 IST
కొందరి కలలు చివరకు కల లాగే మిగిలిపోతుంటాయి. మరికొందరు తమ కలలను సాకారం చేసుకునేందుకు శాయశక్తులా శ్రమించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంటారు. కొందరైతే లేటు వయసులో కూడా తాము అనుకున్న ఆశయాలను నెరవేర్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి..
కొందరి కలలు చివరకు కల లాగే మిగిలిపోతుంటాయి. మరికొందరు తమ కలలను సాకారం చేసుకునేందుకు శాయశక్తులా శ్రమించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంటారు. కొందరైతే లేటు వయసులో కూడా తాము అనుకున్న ఆశయాలను నెరవేర్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం తల్లీకూతుళ్లకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కూతురికి 25ఏళ్లు, తల్లికి 50ఏళ్లు.. ప్రస్తుతం వీరద్దరూ ఎందుకు వార్తల్లోకి ఎక్కారంటే..
యూఎస్ టెక్సాస్‌కు (US Texas) చెందిన 25ఏళ్ల ఎలిజబెత్, 50ఏళ్ల అలిస్సా.. (Mother and daughter) తల్లీకూతుళ్లు. అలిస్సాకు ఎప్పటి నుంచో ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా తీరని కోరికగా ఉండిపోయింది. అయితే ఇటీవల అలిస్సా.. ఎలాగైనా చదువు కొనసాగించాలని అనుకుంది. తన కూతురు ఎలిజబెత్ చదువుతున్న శాన్ ఆంటోనియోలోని అవర్ లేడీ ఆఫ్ లేక్ యూనివర్శిటీలో (University) చేరింది. కూతురుతో పాటూ ఇటీవల మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ప్రోగ్రామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది.
ఎట్టకేలకు శుక్రవారం కూతురు ఎలిజబెత్, అలిస్సా.. ఇద్దరూ మూడవసారి తమ కళవాళ గ్రాడ్యుయేషన్ డేలో (Graduation Day) పాల్గొని పట్టా అందుకున్నారు. సెంట్రల్ టెక్సాస్ కళాశాల నుంచి వీరు సాధారణ అధ్యయనాలు, ఇంటర్ డిసిప్లినరీ అధ్యయనాలతో పాటూ సామాజిక శాస్త్రంలో డిగ్రీ, మేరి హార్టిన్ - బేలన్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (Bachelors degree) పూర్తి చేశారు. క్లాస్‌లో తన తల్లి అసిస్సాను తనతో పాటూ తోటి విద్యార్థులు అందరూ అమ్మ అని పిలిచేవారని ఎలిజబెత్ చెబుతోంది. మొత్తానికి లేటు వయసులో కూతురితో పాటూ డిగ్రీ పట్టా పూర్తి చేసిన అలిస్సా.. వార్తలో నిలిచింది. ప్రస్తుతం ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు.