Marriage: పెళ్లి జరగాల్సి ఉండగా చివరి నిముషంలో మనసు మార్చుకున్న వరుడు.. చివరకు అతడి అత్యాశ గురించి తెలుసుకుని అంతా షాక్..
ABN , First Publish Date - 2023-05-14T20:36:30+05:30 IST
మనిషిని ఆశ ఎంత వరకైనా తీసుకెళ్తుంది. చాలా మంది ఆశలకు అంతూపంతూ అంటూ ఉండదు. ఉన్నదాంతో సంతృప్తి పడకుండా లేనిదాని కోసం వెంపర్లాడుతుంటారు. ఈ క్రమంలో తెలిసి తెలిసి సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా..
మనిషిని ఆశ ఎంత వరకైనా తీసుకెళ్తుంది. చాలా మంది ఆశలకు అంతూపంతూ అంటూ ఉండదు. ఉన్నదాంతో సంతృప్తి పడకుండా లేనిదాని కోసం వెంపర్లాడుతుంటారు. ఈ క్రమంలో తెలిసి తెలిసి సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పెళ్లి జరగాల్సి ఉండగా.. చివరి నిముషంలో వరుడు తన మనసు మార్చుకున్నాడు. చివరకు అతడి అత్యాశ గురించి తెలసుకుని బంధువులంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్ పరిధి రప్తీనగర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడికి.. వికాస్ నగర్ పరిధి బర్గద్వా ప్రాంతానికి చెందిన యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. మే 10న పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా తరలివచ్చారు. వధువు తరపు వారు కళ్యాణ మంటపానికి (wedding hall) చేరుకోవడానికి సిద్ధమయ్యారు. కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరుడికి వేరే పెళ్లి సంబంధం వచ్చింది. వారు ఏకంగా రూ.50లక్షల కట్నం ఇస్తామని చెప్పడంతో వరుడికి (groom) ఎక్కడ లేని ఆశ పుట్టుకొచ్చింది.
వెంటనే ప్రశాంత్ తన మనసు (groom canceled the marriage) మార్చుకున్నాడు. ఈ పెళ్లి నాకు నచ్చలేదని చెప్పేశాడు. ఒక్కసారిగా వరుడు మనసు మార్చుకోవడం చూసి బంధువులంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న వధువు (bride) తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వరుడి వద్దకు వచ్చి ఇదే విషయంపై నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన వరుడు.. వారిని దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు చేసేదేమీ లేక.. వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇరువైపు కుటుంబ సభ్యులను స్టేషన్‌కి పిలిపించి విచారంచారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.