Crime News: రెస్టారెంట్‌లో 18 ఏళ్ల యువతి.. ఫోన్‌లో ఫొటోను చూసి ఆమేనని ఫిక్సయిన పోలీసులు.. సడన్‌గా వెళ్లి ఆమె బ్యాగ్‌ను చెక్ చేస్తే..!
ABN , First Publish Date - 2023-05-16T15:00:32+05:30 IST
కొందరు యువతులు చిన్న చిన్న సమస్యలకూ తీవ్రంగా కుంగిపోతుంటారు. ప్రేమలో మోసపోయామని కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు, తల్లిదండ్రులు మందలించారని మరికొందరు.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు అతి తెలివిగా...
కొందరు యువతులు చిన్న చిన్న సమస్యలకూ తీవ్రంగా కుంగిపోతుంటారు. ప్రేమలో మోసపోయామని కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు, తల్లిదండ్రులు మందలించారని మరికొందరు.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచించి కుటుంబ సభ్యులందరినీ భయపెడుతుంటారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెస్టారెంట్‌లో 18 ఏళ్ల యువతి ఒంటరిగా కూర్చుని ఉంది. హోటల్ సిబ్బంది ఆమె ఫొటోను పోలీసులకు పంపారు. సరిచూసుకుని చివరకు నేరుగా హోటల్‌కి వెళ్లిన పోలీసులు యువతి బ్యాగును చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి (young woman) .. స్థానింగా ఉన్న కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం (BA first year) చదువుతోంది. ఇటీవల పరీక్షలు కూడా రాసింది. తమ కూతురు పాస్ అవుతుందని తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా ఉండేవారు. యువతి కూడా ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఉండేది. అయితే చివరకు ఫలితాలు వెలువడడంతో ఫెయిల్ (young woman failed in the exams) అయినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఎక్కడ మందలిస్తారో అనే భయంతో కళాశాల నుంచి నేరుగా ఉజ్జయినీకి పారిపోయింది. వెళ్తూ వెళ్తూ కొత్త నంబర్ నుంచి తన తండ్రికి ఫోన్.. ఆటో డ్రైవర్ తనను కిడ్నాప్ (Kidnapping drama) చేశాడని చెప్పింది. దీంతో కంగారుపడిన తండ్రి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. అయితే కిడ్నాప్ అయినట్లు ఎక్కడా ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. అయితే ఇటీవల ఉజ్జయినిలోని ఓ హోటల్లో ఒంటరిగా కూర్చున్న యువతిని చూడగానే సిబ్బందికి అనుమానం కలిగింది. దీంతో ఆమె ఫొటో తీసి, పోలీసులకు సమాచారం అందించారు. పారిపోయిన యువతి, ఫొటోలోని యువతి ఒకరే కావడంతో పోలీసులు నేరుగా సదరు హోటల్‌కి వెళ్లారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా.. ఉజ్జయిని బస్ టికెట్, రెస్టారెంట్ బిల్లు తదితరాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులకు భయపడే ఇలా చేసినట్లు యువతి అంగీకరించింది. చివరకు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించి ఇంటికి పంపించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.