Share News

Viral Video: బస్సులో వెనుక సీట్లో కూర్చుని సీక్రెట్‌గా తీసిన వీడియో.. ఈ వ్యక్తి చేసేది చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-12-02T12:37:11+05:30 IST

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం చూడగానే ఆకట్టుకుంటాయి. అందులోనూ ప్రకృతి, కామెడీకి సంబంధించిన వీడియోలు చాలా త్వరగా జనాలకు చేరుతుంటాయి.

Viral Video: బస్సులో వెనుక సీట్లో కూర్చుని సీక్రెట్‌గా తీసిన వీడియో.. ఈ వ్యక్తి చేసేది చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం చూడగానే ఆకట్టుకుంటాయి. అందులోనూ ప్రకృతి, కామెడీకి సంబంధించిన వీడియోలు చాలా త్వరగా జనాలకు చేరుతుంటాయి. ఇలాంటి కామెడీ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెద్దాయన తాలూకు వీడియో అది. తాత అలవాటులో పొరపాటుగా చేసిన పనిని బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియోలోని ఆ తాతకు ఉన్న చిన్న అలవాటు ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

Bank Robbery: సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి రూ.18 కోట్లు కొట్టేశారు..


ఫిజెన్ అనే 'ఎక్స్' (ట్విటర్) యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెద్దాయన బ్లాక్ కోర్టు వేసుకుని సీటులో కూర్చుని ఉండడం మనం వీడియోలో చూడొచ్చు. కొద్దిసేపటి తర్వాత ఆ తాత తన జేబులోంచి దువ్వెన తీసి, దువ్వకోవడం మొదలెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతని తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు. కానీ, ఆ పెద్దాయన గుండుపై దువ్వెనను చాలాసేపటి వరకు అటుఇటు తిప్పడం చేశాడు. అయితే, యంగేజ్‌లో ఆయనకు బాగా జట్టు ఉండి ఉంటుంది. అప్పుడు తాత వాటిని బాగా దువ్వి ఉంటాడు. ఇప్పుడు కూడా అదే అలవాటు ఉండి, ఇలా దువ్వుకుని ఉంటాడు. ఇక తాత అలా గుండుపై దువ్వుకోవడాన్ని బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీసి నెట్టింట పెట్టడం, అది కాస్తా వైరల్‌గా మారడం జరిగిపోయింది.

Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!

ఇప్పటివరకు ఈ వీడియోకు 8.2లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ కామెడీ వీడియోపై వేలాది మంది తమదైనశైలిలో చమత్కరిస్తూ కామెంట్ చేస్తున్నారు. 'పాత అలవాట్లు అంత తొందరగా పోవు', 'తలపై దురద ఉండొచ్చు. అందుకే పెద్దాయన దువ్వెన వాడుతున్నాడు ', 'దువ్వెనకు బదులు బ్రష్ వాడితే బాగుంటుంది' ఇలా పలువురు నెటిజన్లు వీడియోపై స్పందించారు. ఇంకేందుకు ఆలస్యం నెట్టింట నవ్వులుపూయిస్తున్న తాత వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Metro Train Video: మెట్రోలో చిల్లర వేషాలే కాదండోయ్.. ఇలాంటివి కూడా జరుగుతుంటాయ్.. ఈ కుర్రాడు ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-12-02T12:40:00+05:30 IST