Viral Video: చిన్నప్పటి కాకి కథ.. నిజమా కాదా అని పరీక్షించగా.. ఈ కాకి ఏం చేసిందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-11-11T16:37:52+05:30 IST
ప్రతి ఒక్కరూ చిన్ననాటి స్కూల్ డేస్‌లో రకారకాల పిట్ట కథలు ఆసక్తిగా వినే ఉంటారు. ఇందులో కాకి కథ గురించి అందరికీ తెలిసిందే. దాహంతో ఉన్న కాకి నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. దానికి ఎదురుగా ఓ మట్టికుండ కనిపిస్తుంది. అయితే..
ప్రతి ఒక్కరూ చిన్ననాటి స్కూల్ డేస్‌లో రకారకాల పిట్ట కథలు ఆసక్తిగా వినే ఉంటారు. ఇందులో కాకి కథ గురించి అందరికీ తెలిసిందే. దాహంతో ఉన్న కాకి నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. దానికి ఎదురుగా ఓ మట్టికుండ కనిపిస్తుంది. అయితే అందులో ఉన్న నీరు దానికి అందకపోవడంతో చివరకు తెలివిగా ఆలోచిస్తుంది. పక్కన ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి కుండలో వేస్తుంది. తద్వారా లోపల ఉన్న నీరు పైకి వస్తుంది. ఇలా కాకి తన దాహం తీర్చుకుంటుంది. ఇప్పుడీ కథ ఎందుకు చెప్తున్నామంటే.. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషళ్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కథలో మాదిరిగానే ఓ కాకి (crow) దాహంతో నీటి కోసం అటూ, ఇటూ వెతుకుతూ ఉంటుంది. కొందరు కాకి తెలివిని పరీక్షించేందుకు గాజు సీసాలో సగం నీరు పోసి మేడపై ఏర్పాటు చేస్తారు. అలాగే సీసా పక్కనే కొన్ని గులక రాళ్లను కూడా ఉంచుతారు. గాజు సీసాలో నీటిని గమనించిన కాకి సమీపానికి వెళ్తుంది. నీరు తాగాలని చూసినా దానికి అందదు. దీంతో తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న రాళ్లను (thirsty crow put stone in bottle) తీసుకుని సీసాలో వేస్తుంది. ఒకటి, రెండు రాళ్లను వేస్తూ తాగడానికి ప్రయత్నించినా.. దానికి నీరు అందదు.
నీరు అందకపోవడంతో.. ఇలా కాదు అనుకుని అచ్చం కథలో చెప్పిన విధంగా చాలా రాళ్లను తీసుకుని సీసాలో వేస్తుంది. చివరకు నీరు పైకి రావడంతో తన దాహం తీర్చుకుని.. ‘‘చిన్నప్పుడు మీరు విన్న కథ నిజమే’’.. అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయ్’’.. అంటూ కొందరు, ‘‘అరే! ఈ కాకి కథలో ఉన్నట్లుగానే చేసిందే’’.. అని మరికొందరు, ‘‘కాకి చాలా తెలివిగా ప్రవర్తించింది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32 మిలియన్లకు పైగా వ్యూస్‍ను సొంతం చేసుకుంది.