Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

ABN , First Publish Date - 2023-06-01T15:06:46+05:30 IST

ఓ 15 ఏళ్ల బాలుడు స్కూటీ వేసుకుని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. సిబ్బంది స్కూటీలో రూ.200లు పెట్రోల్ వేశారు. అయితే డబ్బులు ఇవ్వమని అడగ్గా.. బాలుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎంత అడిగినా స్పందించకపోవడంతో చివరకు బంకు యాజమాని కలుగజేసుకున్నాడు. అంతా కలిసి..

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

ఓ 15 ఏళ్ల బాలుడు స్కూటీ వేసుకుని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. సిబ్బంది స్కూటీలో రూ.200లు పెట్రోల్ వేశారు. అయితే డబ్బులు ఇవ్వమని అడగ్గా.. బాలుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఎంత అడిగినా స్పందించకపోవడంతో చివరకు బంకు యాజమాని కలుగజేసుకున్నాడు. అంతా కలిసి ప్రశ్నించినా బాలుడి నుంచి నో రెస్పాన్స్. చివరకు పేపర్ ఇచ్చి రాయమని అడగ్గా.. తన పేరు మాత్రం రాశాడు. స్కూటీ ఆర్సీ వివరాల ఆధారంగా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) శివపురిలోని సతన్‌బాబా పోలీస్ స్టేషన్ పరిధి ఖుబాత్ వ్యాలీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ది హైవే ఫ్యూయల్స్ అనే పెట్రోల్ బంకు వద్దకు బుధవారం ఓ 15 ఏళ్ల బాలుడు (15 year old boy) స్కూటీపై వచ్చాడు. పెట్రోల్ బంకు (Petrol Bunk) సిబ్బంది అతడి స్కూటీలో రూ.200లు పెట్రోల్ నింపాడు. అయితే తర్వాత డబ్బులు అడగ్గా అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పదే పదే అడిగినా మౌనంగా ఉండడం తప్ప.. ఏమీ మాట్లాడలేదు. దీంతో సిబ్బంది విషయాన్ని సేల్స్‌ మేనేజర్‌కి (Sales Manager) తెలియజేశారు. అతడు ప్రశ్నించినా బాలుడిని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చివరకు ఓ పేపర్‍పై రాయమని సూచించాడు.

Bride: బ్యూటీ పార్లర్‌కని వెళ్లి ఎంతకూ తిరిగిరాని వధువు.. అనుమానంతో వెళ్లి చూసిన బంధువులకు షాకింగ్ ట్విస్ట్.. వరుడికి విషయం తెలిసి..!

madhya-pradesh-viral-news.jpg

బాలుడు అందులో కన్హా అని రాశాడు. అంతకుమించి ఎలాంటి వివరాలు లేకపోవడంతో చివరకు స్కూటీ ఆర్సీ (Scooty RC) వివరాల ఆధారంగా.. ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేశాడు. బాలుడు తప్పిపోయినట్లు అందులో ఓ పోస్టు చూసి, చివరకు బాలుడు కుటుంబ సభ్యులను సంప్రదించాడు. దీంతో ఎట్టకేలకు కుటుంబ సభ్యులు.. పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి బాలుడిని కలుసుకున్నారు. పాల కోసం మంగళవారం ఉదయం ఇంటి నుంచి స్కూటీ తీసుకుని బయటికి వచ్చాడని, అప్పటి నుంచి కనిపించలేదని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యులు.. బాలుడిని తీసుకుని గ్వాలియర్‌కి వెళ్లిపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News: చేసేదే పాడు పని.. పైగా వీడియో తీసుకున్నారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ లాయర్.. అడ్డంగా దొరికిపోయారుగా..!

Updated Date - 2023-06-01T15:06:46+05:30 IST