Viral News: చేసేదే పాడు పని.. పైగా వీడియో తీసుకున్నారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ లాయర్.. అడ్డంగా దొరికిపోయారుగా..!
ABN , First Publish Date - 2023-05-31T18:16:06+05:30 IST
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులు కొందరు.. అందుకు విరుద్ధంగా భక్షక భటుల్లా మారుతున్నారు. మరికొందరు పోలీసులు.. బాలికలు, యువతులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరకు తమకు వీధి రౌడీలకూ తేడా లేదని నిరూపిస్తుంటారు. ఇలాంటి ..
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులు కొందరు.. అందుకు విరుద్ధంగా భక్షక భటుల్లా మారుతున్నారు. మరికొందరు పోలీసులు.. బాలికలు, యువతులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరకు తమకు వీధి రౌడీలకూ తేడా లేదని నిరూపిస్తుంటారు. ఇలాంటి వారి వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు వస్తుంటుంది. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ లాయర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహిళతో రాసలీలలు ఆడడమే కాకుండా వీడియో కూడా తీసుకుని చివరకు అడ్డంగా దొరికిపోయారు.
రాజస్థాన్ (Rajasthan) ఉదయ్‌పూర్ లసాడియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లసాడియా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సురేంద్రసింగ్ అనే కానిస్టేబుల్, గోగుండా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న లోకేష్ కుమార్ అనే కానిస్టేబుల్‌ను (Constable suspended) ఎస్పీ సస్పెండ్ చేశారు. ఓ లాయర్‌తో కలిసి వీరిద్దరూ మహిళ పట్ల (Indecent behavior on woman) వ్యవహరించిన తీరుపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. సురేంద్రసింగ్, లోకేష్ కుమార్, మరో లాయర్ కలిసి ఓ గదిలో మహిళతో ఉన్నారు. పడుకుని ఉన్న లాయర్.. తన తలను మహిళ ఒడిలో పెటుకుని ఉన్నాడు.
అంతటితో ఆగకుండా ఆమెతో లాయర్ రాసలీలలు కూడా సాగించాడు. పక్కనే కూర్చుని ఉన్న కానిస్టేబుళ్లు ఇద్దరూ ఫుల్‌గా తాగి, ఈ ఘటనను మొత్తం వీడియో కూడా తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సురేంద్ర గతంలో భూపాల్‌పురా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలోనూ ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నాడు. అతడిపై ఓ బాలిక నేరుగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేసింది. దీంతో 2022 డిసెంబర్‌లో అతన్ని లసాడియా స్టేషన్‌కి బదిలీ చేసి, కేసు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఐదు రోజుల క్రితం గోగుండా పలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి మృతిపై గోగుండా సీఐతో పాటూ ఆరుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్ అవడం తీవ్ర చర్చనీయాంశమైంది.