Wife: భర్తకు విడాకులు ఇచ్చి.. రూ.8.30 లక్షలు నష్టపోయిందో భార్య.. అదేంటని అవాక్కవుతున్నారా..?
ABN , First Publish Date - 2023-08-18T16:45:44+05:30 IST
కొన్నిసార్లు ఒకరి అవసరం.. ఇంకొకరికి అవకాశంగా మారొచ్చు. ఈ క్రమంలో చాలా మంది ఎదుటి వారి అవసరాన్ని అవకాశంగా తీసుకుని చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా మహిళ విషయంలోనే జరుగుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్తకు..
కొన్నిసార్లు ఒకరి అవసరం.. ఇంకొకరికి అవకాశంగా మారొచ్చు. ఈ క్రమంలో చాలా మంది ఎదుటి వారి అవసరాన్ని అవకాశంగా తీసుకుని చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా మహిళ విషయంలోనే జరుగుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న ఓ మహిళ.. చివరకు రూ.8.30 లక్షలు నష్టపోయింది. అందేంటని అవాక్కవుతున్నారా.. ఆమె చేసిన ఒక్క పొరపాటు వల్లే ఇంత నష్టం జరిగింది. అసలు ఏం జరిగిందంటే..
యూఎస్‌కి చెందిన కెంటకీ అనే ప్రాంతానికి చెందిన మెక్‌కైలా అనే మహిళ (US woman) సినీ కళాకారిణి. ప్రస్తుతం ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటోంది. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ (Cine artist) జీవనం సాగిస్తోంది. మంచి మంచి వేషాల కోసం ఎంతో మంది డైరెక్టర్లను, నిర్మాతలను కలుస్తూ ఉండేది. అయినా ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పరిచయాలు పెంచుకునేందుకు ఉండేందుకు గాను.. ఇటీవల ఆన్‌లైన్ ఆర్టిస్ట్ ఫోరమ్ అనే గ్రూపులో చేరింది. ఇటీవల ఆమెకు ఓ వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. అందులో తాను స్ట్రేంజర్ థింగ్స్ (stranger things) అనే చిత్రంలో బిల్లీ హార్గ్రోవ్ పాత్ర పోషించిన ప్రసిద్ధ నటుడైన డాక్రే మోంట్‌గోమెరీ అని పరిచయం చేసుకున్నాడు.
అతడు చెప్పిన మాటలకు ఆమెకు ఓవైపు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయినా.. మరోవైపు కొంచెం అనుమానం ఉండేది. అయితే ఆమె పూర్తిగా నమ్మేలా అతను ఏవేవో సాక్ష్యాలు చూపించాడు. పెద్ద సినిమాలో అవకాశం (film opportunities) ఇస్తానని చెప్పడంతో అతన్ని పూర్తిగా నమ్మిన మెక్‌కైలా.. ఇక తన లైఫ్ సెట్ అయిపోయినట్లే అని అనుకుంది. ఈ క్రమంలో ఓ రోజు తన ఆర్థిక లావాదేవీల గురించి.. మోంట్‌గోమెరీ విచిత్ర సమస్యను లేవనెత్తాడు. తన బ్యాంకు లావాదేవీలన్నీ (Bank transactions) లివ్ పొల్లాక్ అనే తన స్నేహితురాలు చూసుకుంటోందని, అయితే ఈ కారణంగా తనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పాడు. దీంతో మెక్‌కైలా అతడికి క్రమంగా డబ్బులు పంపుతూ వచ్చింది. ఇలా విడతల వారీగా మొత్తం $10,000 (రూ.8,30850)లు పంపించింది. తర్వాత అతని నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో చివరకు మోసపోయానని తెలుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral: వావ్.. నువ్వు నిజంగా సూపర్ బ్రదర్.. 25 ఏళ్ల ఈ కుర్రాడి క్రియేటివిటీని చూసి ఫిదా అవడం ఖాయం..!