Viral Video: అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా..? ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని..
ABN , First Publish Date - 2023-03-23T18:44:28+05:30 IST
సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో.. కాస్త వినూత్నంగా ఉన్న చిన్న చిన్న ఘటనలు కూడా వీడియోల రూపంలో నెట్టింట సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం..
సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో.. కాస్త వినూత్నంగా ఉన్న చిన్న చిన్న ఘటనలు కూడా వీడియోల రూపంలో నెట్టింట సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మెట్రో రైల్లో ఓ యువకుడు మోకాళ్లపై కూర్చుని చేసిన పని చూసి చూసి అంతా షాక్ అవుతున్నారు. అమ్మ బాబోయ్.. మెట్రో రైల్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ (Madhya Pradesh) నోయిడా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మిత్రులు నోయిడాలో మెట్రో రైలు (Metro train) ఎక్కుతారు. వారిలో ఓ మిత్రుడు మొబైల్ కెమెరా (Mobile camera) ఆన్ చేసి, రీల్ వీడియో చేసేందుకు సిద్ధమవుతాడు. అప్పటికే పక్కనున్న వ్యక్తి మందు (alcohol) తాగి ఉంటాడు. రైలు ఎక్కగానే మందుబాబు మరింత రెచ్చిపోతాడు. కాసేపు ప్రశాంతంగా ఉన్న అతను.. పక్కన ఉన్న ప్రయాణికుడితో గొడవకు దిగుతాడు. తాను టికెట్ చేసుకున్నానని, దిగబోయే స్టేషన్ పేరు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నువ్వు నాకు చదువు చెప్పొందంటూ వాగ్వాదానికి దిగుతాడు. పక్కనే కూర్చుని ఉన్న ఓ పెద్దాయన.. ఇదంతా గమనిస్తుంటాడు. గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు మందు తాగిన యువకుడిని సున్నితంగా వారించే ప్రయత్నం చేస్తాడు.
Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..
దీంతో వృద్ధుడిపై (old man) సదరు మందుబాబుకు తెగ ప్రేమ పుట్టుకొస్తుంది. వెంటనే అతడి ముందు మోకాళ్ల మీద కూర్చుని పాదాభివందనం చేస్తాడు. ‘‘వహే గురు జీ దా ఖల్సా, వహే గురు జీ ది ఫతే’’.. అంటూ గట్టిగా అరుస్తూ జేజేలు కొడతాడు. ‘‘మీ స్టేషన్ వచ్చింది.. జాగ్రత్తగా వెళ్లండి’’.. అంటూ చివరగా అతడికి వృద్ధుడు సలహా ఇస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా (Viral videos) మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ పెగ్గు వేయగానే ప్రపంచాన్నే జయించినంత శక్తి వచ్చింది.. అని కొందరు, మొత్తానికి పెద్దాయన మనసు గెలుచుకున్నాడు.. అని మరికొందరు, ఇలాంటి వారు కూడా ఉంటారా.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.