Delivery Boy: ఈ డెలివరీ బాయ్‌కు ఇదేం పాడుబుద్ది.. ఓ యువతి పిజ్జా ఆర్డర్ చేస్తే..
ABN , First Publish Date - 2023-07-01T15:25:24+05:30 IST
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే వచ్చి చేరుతున్నాయి. ఇక ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వివిధ రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే వచ్చి చేరుతున్నాయి. ఇక ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ వివిధ రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని సమస్యలు ఎదురవుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కి (Uttar Pradesh) చెందిన యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్డర్ చేసిన పిజ్జాను తెచ్చిన వ్యక్తి.. తర్వాత ‘‘ఐలవ్యూ’’.. అని చెప్పడంతో యువతి షాక్ అయింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
సోషల్ మీడియాలో డెలివరీ బాయ్‌కి సంబంధించిన వార్త (Viral news) ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. కనిష్క అనే యువతి (young woman) ఇటీవల డొమినోస్ పిజ్జా (Domino's Pizza) ఆర్డర్ చేసింది. పిజ్జాను తీసుకొచ్చిన యువకుడు.. మరుసటి రోజు ఆమె నంబర్‌కు ఓ సందేశం (Love proposal message) పంపాడు. ‘‘క్షమించండి నా పేరు కబీర్.. నిన్న నేను పిజ్జా డెలివరీ చేయడానికి మీ ఇంటికి వచ్చాను.. నేను మాత్రమే అక్కడ ఉన్నాను. నువ్వంటే నాకు ఇష్టం’’.. అని మెసేజ్ చేశాడు. ఇది చదివి యువతి షాక్ అయింది. వెంటనే ఆ సందేశాన్ని స్క్రీన్ షాట్ తీసి, డొమినోస్ కంపెనీకి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో (Twitter) షేర్ చేసింది. ‘‘మా నంబర్లు, చిరునామా తీసుకుని.. డెలివరీ బాయ్‌లను వేధించడానికి పంపుతున్నారా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కస్టమర్ల నంబర్లను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. దీనిపై డొమినోస్ కంపెనీ వారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో అదే పోస్టును యూపీ పోలీసులకు ట్యాగ్ చేసింది. ‘‘కబీర్ అనే డెలివరీ బాయ్ వద్ద నా ఫోన్ నంబర్, చిరునామా ఉంది.. మా కుటుంబానికి ఏదైనా ప్రాణహాని జరిగితే.. దానికి డొమినోస్ కంపెనీ బాధ్యత వహించాలి’’.. అని ఆరోపించింది. సదరు డెలివరీ బాయ్ పేరు ఒక్కోచోట ఒక్కోలా ఉందని చెప్పింది. చాట్‌లో కబీర్ అని, స్టోర్‌లో మన్ను అని ఈమెయిల్‌లో కబీర్ బబ్లూ అని వివిధ రకాలుగా నమోదై ఉందని తెలిపింది. మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.