Viral Video: పెళ్లిలో డాన్స్ వేస్తూ.. ఉన్నట్టుండీ ఈ వ్యక్తి చేసిన పనికి షాకైన పోలీస్.. చివరకు ఏమైందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-03-14T16:47:12+05:30 IST
సాధారణంగా కొందరు యువకుల అల్లరికి అద్దూఅదుపూ లేకుండా ఉంటుంది. అలాంటిది ఇక వివాహ కార్యక్రమాల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సేవించి కొందరు, డీజే పాటలకు డాన్సులు వేస్తూ ఇంకొందరు, వధూవరులను ఆట పట్టిస్తూ మరికొందరు..
సాధారణంగా కొందరు యువకుల అల్లరికి అద్దూఅదుపూ లేకుండా ఉంటుంది. అలాంటిది ఇక వివాహ కార్యక్రమాల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సేవించి కొందరు, డీజే పాటలకు డాన్సులు వేస్తూ ఇంకొందరు, వధూవరులను ఆట పట్టిస్తూ మరికొందరు.. అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు పెళ్లిలో డాన్స్ చేస్తూ.. ఉన్నట్టుండి చేసిన పనికి చివరకు పోలీసులే షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఓ యువకుడి డాన్స్‌కి సంబంధించిన వీడియో (Dance viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. వివాహ కార్యక్రమం (marriage) సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులంతా డాన్స్‌లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. డీజే పాటలకు (DJ songs) యువకులు డాన్సులు వేస్తుంటే.. అతిథులంతా ఆసక్తిగా తిలకిస్తుంటారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొందరు పోలీసులు (police) విధులు నిర్వర్తిస్తుంటారు. ఇదిలావుండగా, ఓ యువకుడు డాన్స్ వేసే క్రమంలో అత్యత్సాహం ప్రదర్శించాడు. అప్పటికే ఫుల్‌గా మందు కొట్టి డాన్స్ వేస్తున్న అతను.. మధ్యలో అటుగా వెళ్తున్న పోలీసును అడ్డుకుంటాడు. అంతటితో ఆగకుండా ఉన్నట్టుండి దగ్గరకు తీసుకుని, గట్టిగా ముద్దు (kiss) పెడతాడు.
ఊహించని ఈ ఘటనతో సదరు పోలీస్ షాక్ అవుతాడు. వెంటనే అతడిని పక్కకు నెట్టి.. చెంప మీద చేత్తో గట్టిగా ఒక్కటి ఇస్తాడు. దీంతో యువకుడు వెనక్కు వెళ్లిపోతాడు. అప్పటికీ కోపం తగ్గని పోలీస్.. అతడికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని చూస్తాడు. అతన్ని పట్టుకోవడం కోసం కొంచెం ముందుకు వెళతాడు.. అయితే ఏమనుకున్నాడో ఏమో గానీ సడన్‌గా మనసు మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.