Viral Video: మహిళ ముందు విన్యాసం చేయాలని చూశాడు.. చివరకు కాలు చూసుకుని ఖంగుతిన్నాడు..
ABN , First Publish Date - 2023-03-12T20:30:00+05:30 IST
ప్రస్తుత సోషల్ మీడియా రీల్స్ ప్రపంచంలో ప్రతి సన్నివేశాన్ని తమ ఫోన్లలో బంధించి రీల్స్‌గా మార్చడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరు యువకులు చేసే విన్యాసాలు చూసేందుకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. మరికొందరైతే మహిళల ముందు ఫోజులు కొడుతూ..
ప్రస్తుత సోషల్ మీడియా రీల్స్ ప్రపంచంలో ప్రతి సన్నివేశాన్ని తమ ఫోన్లలో బంధించి రీల్స్‌గా మార్చడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరు యువకులు చేసే విన్యాసాలు చూసేందుకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. మరికొందరైతే మహిళల ముందు ఫోజులు కొడుతూ స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చివరకు ఈ రీల్స్ వద్దు.. ఏమీ వద్దురా బాబూ.. అనుకునే పరిస్థితి వస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు మహిళ ముందు విన్యాసం చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే చివరకు చోటు చేసుకున్న ఘటనతో ఖంగుతిన్నాడు.
సోషల్ మీడియాలో ఓ యువకుడి విన్యాసానికి సంబంధించిన వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో కొన్ని ప్రేమ జంటలు (love couples), మరికొందరు మహిళలు సేద తీరుతూ ఉంటారు. మధ్యలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు.. వారి ముందు విన్యాసాలు (Stunts) చేసి, వీడియో తీయాలని అనుకుంటారు. ముందుగా ఓ పెద్ద బెలూన్‌లో గాలి నింపి, ఇసుకలో పూడ్చిపెడతారు. తర్వాత ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా.. మరో యువకుడు స్టంట్ చేసేందుకు సిద్ధపడతాడు. ఇతను ఏం చేస్తాడా.. అని పక్కనే ఉన్న ప్రేమ జంట గమనిస్తూ ఉంటుంది. బెలూన్‌పై నిల్చున్న యువకుడు.. దాన్ని గట్టిగా తన్ని గింగిరాలు తిరిగి మళ్లీ యథావిధిగా నిలబడాలని ప్రయత్నిస్తాడు. అందుకు తగ్గట్టుగానే బెలూన్‌ను తన్ని గాల్లోకి లేస్తాడు.
అయితే గింగిరాలు తిరిగి మళ్లీ నిలబడే క్రమంలో పొరపాటున కిందపడతాడు. ఈ క్రమంలో అతడి కాలు నేలకి గట్టిగా తాకుతుంది. దీంతో వామ్మో! అని కాలును గట్టిగా పట్టుకుని విలవిల్లాడిపోతాడు. వీడియో తీస్తున్న వ్యక్తి.. ఏమైందో అని అలాగే దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే.. అతగి కాలి రెండు వేళ్లు విరిగిపోవడం కనిపిస్తుంది. దీంతో పాదం మీద ఎముకలు విరిగి ఉబ్బెత్తుగా బయటికి వస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా (Trending videos) మారింది. సాధ్యం కాని విన్యాసాలను కూడా చేసి చూపించాలని ప్రయత్నిస్తే.. ఇలాగే జరుగుతుంది.. అని కొందరు, ఇలాంటి విన్యాసాలను నిపుణుల సమక్షంలో చేయాలి.. అంటూ మరికొందరు సూచిస్తున్నారు.