Smart phone: ఇతడి ఫోన్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవడం.. కంప్యూటర్కీ సాధ్యం కాదేమో.. ఎలా అన్‌లాక్ చేస్తున్నాడో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-07-30T18:17:49+05:30 IST
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మూరుమూల ప్రాంతాలకు సైతం చేరిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చి వాలిపోయిందనేది వాస్తవం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉండడం సర్వసాధారమైపోయింది. అయితే ...
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మూరుమూల ప్రాంతాలకు సైతం చేరిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చి వాలిపోయిందనేది వాస్తవం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉండడం సర్వసాధారమైపోయింది. అయితే ఈ ఫోన్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు సర్వం దోచేస్తున్నారు. దీంతో చాలా మంది తమ ఫోన్లలో సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడి తెలివితేటలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి ఫోన్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవడం.. కంప్యూటర్కీ సాధ్యం కాదేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఫోన్‌ను ఎవరూ ఆన్ చేయకుండా, మరోవైపు ఎవరూ హ్యాక్ చేయకుండా పటిష్టమైన పాస్వర్డ్ (Phone password) పెట్టుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా ఎవరికీ సాధ్యం కాని విధంగా అత్యంత పొడవైన పాస్వర్డ్ పెట్టుకున్నాడు. అది కూడా ఎంతలా అంటే కళ్లతో చూసినా గుర్తు పెట్టుకోలేని విధంగా ఏర్పాటు చేశాడు. స్వయంగా అతడు తన ఫోన్‌ను ఆన్ చేయడానికే చాలా సమయం పట్టింది. ఫోన్ పట్టుకున్న యువకుడు.. ఏదో నొక్కుతున్నట్లు గమనించిన మరో వ్యక్తి చాటుగా వీడియో తీశాడు.
సదరు వ్యక్తి చాలా సేపు నంబర్లు నొక్కగా నొక్కగా.. చివరకు ఫోన్ ఆన్ అయింది. దీంతో చివరకు, అంతవరకూ అతడు నొక్కింది ఫోన్ పాస్‌వర్డ్‌కు సంబంధించిన నంబర్లా.. అనుకుని అంతా షాక్ అయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతడు గణిత మేధావి ఉన్నట్టున్నాడే’’.. అని కొందరు, ‘‘ఈ పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవడం కంప్యూటర్కీ సాధ్యం కాదు’’.. అని మరికొందరు, ‘‘ఇతడి జ్ఞాపకశక్తి అమోఘం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.