Teacher: క్లాస్‌రూమ్‌లోనే నిద్రపోతున్న టీచర్.. మొబైల్‌లో ఫొటోను తీసిన హెడ్మాస్టర్.. చివరకు ఊహించని సీన్..! | female teacher attacking the principal because he took a photo while he was sleeping In Bihar news is going viral kjr spl

Teacher: క్లాస్‌రూమ్‌లోనే నిద్రపోతున్న టీచర్.. మొబైల్‌లో ఫొటోను తీసిన హెడ్మాస్టర్.. చివరకు ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2023-07-29T19:46:17+05:30 IST

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఓవైపు అరకొర సౌకర్యాలు, మరోవైపు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక బాలికల ఇబ్బందుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Teacher: క్లాస్‌రూమ్‌లోనే నిద్రపోతున్న టీచర్.. మొబైల్‌లో ఫొటోను తీసిన హెడ్మాస్టర్.. చివరకు ఊహించని సీన్..!

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఓవైపు అరకొర సౌకర్యాలు, మరోవైపు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక బాలికల ఇబ్బందుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ టీచర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పకుండా నిద్రపోతుండడం చూసి హెడ్మాస్టర్‌కు కోపం వచ్చింది. ఇదేం పనంటూ నిలదీద్దామని ఫొటో తీస్తే.. చివరకు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) సుపాల్ జిల్లా ఛతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝఖర్‌ఘర్ పంచాయతీకి చెందిన మక్త్రా మిడిల్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సజ్దా ఖాతూన్ అనే మహిళ ఈ స్కూల్లో టీచర్‌గా (Teacher) పని చేస్తోంది. అయితే జూన్ 25న రోజూలాగే పాఠశాలకు వచ్చిన ఆమె.. క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా నిద్రపోయింది. అదే సమయంలో ఈ పాఠశాలను పరిశీలించడానికి.. రాంపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ రామ్ వచ్చాడు. నిద్రపోతున్న టీచర్‌ను చూసి పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రైస్ ఆలమ్‌ను పిలిపించి చూపించాడు.

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

bihar-women.jpg

దీంతో ప్రధానోపాధ్యాయుడు రైస్ ఆలమ్.. ఆమెను మందలించే ఉద్దేశంతో ఫొటో తీశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీచర్.. తర్వాత రైస్ ఆలమ్‌తో వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగకుండా తన తమ్ముడికి ఫోన్ చేసి పిలిపించింది. అక్కడి వచ్చిన అతను ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రైస్ ఆలమ్‌పై దాడి చేసి, ఫోన్ లాక్కున్నాడు. ఇద్దరూ కలిసి ప్రధానోపాధ్యాయుడిని దుర్భాషలాడుతూ (Attack on the principal) దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రైస్ ఆలమ్‌ మొఖంపై గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం బాధితుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-29T19:46:17+05:30 IST