Viral Video: లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొనలేక.. ఎండలను భరించలేక.. ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. సైకిల్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-05-25T17:14:40+05:30 IST
కొందరు సమస్యలను నుంచి బయటపడే తరుణోపాయం లేక.. ఇబ్బందులను భరిస్తూనే కాలం వెల్లదీస్తుంటారు. మరికొందరు ఎంత పెద్ద సమస్యకైనా చాలా తెలివిగా పరిష్కారాన్ని వెతుకుతుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులను.. తమ సమస్యలకు పరిష్కారాలుగా వాడుకుంటుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన..
కొందరు సమస్యలను నుంచి బయటపడే తరుణోపాయం లేక.. ఇబ్బందులను భరిస్తూనే కాలం వెల్లదీస్తుంటారు. మరికొందరు ఎంత పెద్ద సమస్యకైనా చాలా తెలివిగా పరిష్కారాన్ని వెతుకుతుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులను.. తమ సమస్యలకు పరిష్కారాలుగా వాడుకుంటుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వృద్ధుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొనలేక.. మరోవైపు ఎండలను భరించలే.. చివరకు వెరైటీ ప్లాన్ వేశాడు. అతడు తన సైకిల్‌ను ఎలా మార్చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అసలే ఎండలు మండిపోతున్న ప్రస్తుతం తరుణంలో బయటికి వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. ఖరీదైన కార్లు ఉన్న వారు.. ఏసీలు వేసుకుని హాయిగా ప్రయాణం చేస్తుంటారు. కానీ సమాన్యుల పరిస్థితి అలా ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో సైకిళ్లు, బైకుల్లో ఎండలో ఇబ్బంది పడుతూనే ప్రయాణం చేస్తుంటారు. అయితే ఓ వృద్ధుడు (old man) .. తనకున్న సైకిల్‌పై వెళ్తూనే ఎండ, వర్షం బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాడు. చివరగా అతడికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా సైకిల్‌పై (Cycle) హాయిగా ప్రయాణం చేయాలనుకున్న అతడి కలను సాకారం చేసుకున్నాడు.
ఇందుకోసం కొన్ని కర్రలను (sticks) తీసుకుని, సైకిల్ చుట్టూ సమాంతరంగా పేర్చి పందిరిలా కట్టేశాడు. పైన ఎండ తగలకుండా, వర్షం పడకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇలా సైకిల్‌ను సిద్ధం చేసుకుని.. రోడ్డుపై కూల్ కూల్‌గా ప్రయాణం సాగించాడు. వృద్ధుడి తెలివితేటలు చూసి మిగతా వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి అతడిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘‘ఆహా! ఇలా ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుంటుంది’’.. అని కొందరు, ‘‘ఈ పెద్దాయన తెలితేటలు అమోఘం’’.. అని మరికొందరు, ‘‘స్పీడ్ బ్రేకర్ల వద్ద కర్రలు నేల తాకకుండా చూసుకుంటే సరిపోతుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.