Viral News: సాఫ్ట్‌వేర్ కష్టాలు పడీ పడీ ఈ 29 ఏళ్ల కుర్రాడికి విసుగొచ్చిందట.. చివరకు జాబ్‌కు రిజైన్ చేసి ఏం చేస్తున్నాడంటే..!
ABN , First Publish Date - 2023-05-24T17:17:08+05:30 IST
నేటి ఉరుకు పరుగుల జీవితంలో చాలా మందికి ప్రశాంతత దొరకండం లేదు. ఇక నగరాల్లో అయితే కనీసం దంపతులు కూడా సరదాగా గడిపే పరిస్థితులు లేవు. ఇంట్లో ఇద్దరూ పని చేస్తుండడంతో క్షణం తీరిక దొరికే పరిస్థితి కూడా ఉండడం లేదు. ఈ క్రమంలో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. మరికొందరు..
నేటి ఉరుకు పరుగుల జీవితంలో చాలా మందికి ప్రశాంతత దొరకండం లేదు. ఇక నగరాల్లో అయితే కనీసం దంపతులు కూడా సరదాగా గడిపే పరిస్థితులు లేవు. ఇంట్లో ఇద్దరూ పని చేస్తుండడంతో క్షణం తీరిక దొరికే పరిస్థితి కూడా ఉండడం లేదు. ఈ క్రమంలో కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతత కోసం వివిధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం చూస్తూ ఉంటాం. అందమైన ప్రదేశాల్లో కొన్నాళ్లు గడపడం, మళ్లీ యథావిధిగా రోజు వారీ జీవితాన్ని గడపడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 29 ఏళ్ల వ్యక్తి.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. సాఫ్ట్‌వేర్ కష్టాలు పడీ పడీ విసుగొచ్చి.. చివరకు జాబ్‌కు రిజైన్ చేశాడు. ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడంటే..
చైనా బీజింగ్‌కు (China Beijing) చెందిన లి షు అనే 29 ఏళ్ల వ్యక్తి.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో (software company) పని చేస్తూ లక్షల జీతం ఆర్జిస్తుండేవాడు. మంచి జీతం వస్తుండడంతో ఇతడి లైఫ్ లగ్జరీగా సాగేది. అయితే కొన్నేళ్లకు ఇతడికి ఉద్యోగంపై విరక్తి పుట్టిందట. ఎలాంటి బాదరబందీ లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో 2018లో తన ఉద్యోగానికి రాజీనామా (Resignation from job) చేశాడు. ఇతడు ఏదైనా వ్యాపారం చేస్తాడేమో అని స్నేహితులంతా అనుకున్నారు. అయితే వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సదరు యువకుడు వినూత్న నిర్ణయం (Innovative decision) తీసుకున్నాడు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండాలని డిసైడ్ అయ్యాడు.
ఎక్కువ సమయం తన అపార్ట్‌మెంట్‌లోనే గడుపుతూ మొదట్ల రోజుకు రూ.120లు మాత్రమే ఖర్చు పెడుతూ వచ్చాడు. అయితే కొన్ని నెలలకు తన వద్ద ఉన్న డబ్బులు కూడా ఖర్చవుతూ వచ్చాయి. దీంతో లీ షు తన ఖర్చులు తగ్గించుకునేందుకు అపార్ట్‌మెంట్ ఖాళీ చేశాడు. తన వద్ద ఉన్న వస్తువులను విక్రయించగా వచ్చిన రూ.5వేలతో ఓ టెంట్ కొనుక్కకుని పార్కులో పడుకోవడం (Sleeping in tent) మొదలెట్టాడు. అప్పటి నుంచి అతడి వద్ద కేవలం టెంట్, నూడిల్స్ వంటి ఆహార పదార్థాలు మాత్రమే ఉండేవి. న్యూడిల్స్, గుడ్లు తదితరాలను ఆహారంగా తీసుకోవడం.. టెంట్‌లో పడుకోవడం.. దీన్నే దినచర్యగా మార్చుకున్నాడు.
ఈ యువకుడు మాట్లాడుతూ ప్రస్తుతం తన లైఫ్ ఎంతో ఆనందంగా సాగుతోందని చెప్పాడు. తనపై బాస్‌ల ఒత్తిడి గానీ, వర్క్ టెన్షన్ గానీ ఏమీ లేదని తెలిపాడు. తన స్నేహితులు ఇప్పటికీ మంచి ఉద్యోగాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని, అలాగే వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు కూడా ఇస్తారన్నాడు. అయితే తనకు ఈ జీవితమే ఎంతో బాగుందని, లైఫ్ లాంగ్ ఇలాగే బతికేస్తానని లీ షూ చెబుతున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ యువకుడికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో (Viral news) తెగ వైరల్ అవుతోంది.