Viral Video: నువ్వు కదయ్యా.. అసలు సిసలు తండ్రివంటే.. కూతురి సంతోషం కోసం అమ్మాయిలాగా వేషం వేసుకుని మరీ..!

ABN , First Publish Date - 2023-05-05T15:23:55+05:30 IST

చాలా మంది వండర్ వుమన్ వేషధారణలో కనిపించడానికి ఉవ్విల్లూరుతుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అలరించడానికి.. ఐరన్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్.. ఇలా..

Viral Video: నువ్వు కదయ్యా.. అసలు సిసలు తండ్రివంటే.. కూతురి సంతోషం కోసం అమ్మాయిలాగా వేషం వేసుకుని మరీ..!

ఐరన్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్.. లాగే వండర్ వుమన్ పాత్ర కూడా ప్రపంచ దేశాల్లో ఎంతో మంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది. వండర్ వుమన్ పేరుతో ఉన్న DC కామిక్స్ పాత్ర ఆధారంగా2017లో విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్యాయంపై పోరాడే వండర్ వుమన్‌ను చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడతారు. చాలా మంది వండర్ వుమన్ వేషధారణలో కనిపించడానికి ఉవ్విల్లూరుతుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అలరించడానికి.. ఐరన్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్.. ఇలా ఫేమస్ అయిన పాత్రల వేషధారణలో కనిపిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ తండ్రి తన కూతురు సంతోషం కోసం అమ్మాయి వేషంలో కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ పాపకు వండర్ ఉమన్ (Wonder Woman) పాత్ర అంటే ఎంతో ఇష్టం. దీన్ని గమనించిన తండ్రి.. తన కూతురిని సర్‌ఫ్రైజ్ (father surprised his daughter) చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన కూతురికి ఇష్టమైన వండర్ వుమన్ వేషధారణలో తన పాప ముందుకు వచ్చాడు. తనకు ఇష్టమైన వండర్ వుమన్ పాత్రలో తండ్రి కనిపించగానే.. ఆ పాప ఎంతో మురిసిపోయింది. సంతోషంతో గెంతులేస్తూ తండ్రిని ప్రేమతో కౌగిలించుకుంది.

Viral News: ఫైవ్‌స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పాడు పని.. ఈ 23 ఏళ్ల యువతికి కోట్లలో ఆస్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..!

చేతిలో ఓ బొమ్మ పట్టుకుని ఉన్న తండ్రి.. తన కూతురి చేయి పట్టుకుని నడుస్తూ రావడం చూసి చుట్టుపక్కల వాళ్లు.. అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఈ తండ్రి నిర్ణయం సూపర్’’.. అంటూ కొందరు, ‘‘వుండర్ వుమన్ గెటప్.. సింప్లీ సూపర్’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రతి కూతురికీ ఇలాంటి తండ్రి కావాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

Updated Date - 2023-05-05T15:23:55+05:30 IST